దర్వాజాలు అంటే ప్రవేశ ద్వారాలు లేదా మార్గాలు. ఈ స్మారకాల నగరం కు ప్రవేశ మార్గాలు. ఇవి నగరం అంతా ఏర్పరచారు. చరిత్రలో ఇండియాలో అతి బలంగా నిర్మించబడిన సిటీ లలో మండు ఒకటి. ఇక్కడ కల కోట నేటికి ఎంతో బలంగా కనపడుతుంది. మండు నగరం చుట్టూ కల 45 కి. మీ. గోడ కు వివిధ ప్రదేశాలలో 12 దర్వాజాలు ఉంచారు.
అన్నింటిలోకి 'ఢిల్లీ దర్వాజా ' ప్రసిద్ధి. ఇది నగర ప్రధాన గేటు. ప్రస్తుతం సిటీ లోకి వెళ్ళాలంటే ఆలంగిర్ మరియు భంగి దర్వాజా లు వాడుతున్నారు. రామ్పోల్ దర్వాజా, తారాపూర్ గేటు , జహంగీర్ గేటు వంటివి మరికొన్ని ప్రాధాన్యత కల దర్వాజాలు. ఈ రాజ్యం లోకి ప్రవేశించటం ఆ రోజుల్లో ఎంతో కష్టతరమైన పనిగా చెప్పేవారు. నగరంలోని ఈ దర్వాజాలు, ఆ నాటి శిల్ప శైలి కి ప్రతీకలు.



Click it and Unblock the Notifications