జహాజ్ మహల్ చాలా అద్భుత నిర్మాణం. ఇది రెండు సరస్సులు అంటే, కపూర్ తలావ్ మరియు మున్జ్ తలవ ల మధ్య నిర్మించారు. జహాజ్ మహల్ అంటే 'షిప్ పాలస్' అని అర్ధం. దీని నిర్మాణం షిప్ ఆకారం పోలి వుంటుంది. దీనిని ఖిల్ల్జి వంశానికి చెందిన ఘియ ఉద్దీన్ ఖిల్జీ నిర్మించాడు.
ఈ మహల్ లో అనేక కాలువలు, ఫౌంటెన్ లు కలవు. సుల్తాన్ తనకు గల వేలాది మహిళల కొరకు ఈ భవనం నిర్మించాడు. అనేక స్తంభాలు, ఆర్చీలుతో రెండు అంతస్తులు కలిగి వుంటుంది. మండు పర్యటనలో ఇది తప్పక చూడ దగిన ప్రదేశం. ఇక్కడ కల సుందర ప్రదేశాలను చక్కని ఫోటోలుగా తీయవచ్చు. ప్రతి ఒక్కరూ ఇక్కడి ప్రకృతి దృశ్యాలను తప్పక అభినందించి తీరతారు.



Click it and Unblock the Notifications