నాగాలాండ్ లో ని మోకోక్చుంగ్ ను ఒక ముఖ్య ప్రదేశంగా దాని యొక్క ఏయో తెగ ఉనికి వల్ల భావిస్తారు. నాగాలాండ్ యొక్క హృదయ భాగం వంటి మోకోక్చుంగ్ కు సంబంధించి అనేక ఆసక్తి కర విషయాలు ఉన్నాయి. అటువంటి విశేషాలలో ఒకటి ఈ మ్యూజియం. ఈ జిల్లా మ్యూజియం అనేక శతాబ్దాలు ఏయో ల జీవన విధానాలను తెలియజేస్తుంది.
ఈ మ్యూజియం జిల్లా యొక్క ఆర్ట్స్ అండ్ కల్చరల్ కాంప్లెక్స్ లో ఉన్నది. కత్తులు, షీల్డ్స్, నాగా షాల్స్ వంటి సాంప్రదాయక దుస్తులు,సాంప్రదాయక ఆభరణాలు మరియు వస్తువులు ఇక్కడ ప్రదర్శనలో చూడవచ్చు. అంతే కాక, ఏయో తెగ కు ఇతర తెగలకు ఉన్న వ్యత్యాసాలను కూడా పర్యాటకులు తెలుసుకోవచ్చు. ఇక్కడ గడిపే సమయం ఏయో తెగ యొక్క విశేషాలను పర్యాటకులకు తెలియచేస్తుంది.



Click it and Unblock the Notifications