మోరి ని సందర్శించే పర్యాటకులలో అమితంగా ప్రాచుర్యం పొందిన ఆక్టివిటీ కామ్పింగ్. చుట్టూ దట్టమైన పచ్చటి అడవులతో టాన్స్ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం కామ్పింగ్ కి అనువైన ప్రదేశం. అందుబాటు ధర ల లోనే సందర్శకులకి కామ్పింగ్ సౌకర్యాలను అందించే ఎన్నో రిసార్ట్స్ ఇక్కడ ఉన్నాయి. వణికించే చలితో రాత్రులని చలి మంటలు అలాగే బర్బెక్యు తో ఆహ్లాదకరంగా మార్చుకునే అవకాశం కూడా ఈ రిసార్ట్స్ అందిస్తున్నాయి. అంతే కాకుండా, మోరి లో ని కామ్పింగ్ ద్వారా స్వదేశీ వృక్ష మరియు జంతు జాలాలను గమనించే అవకాశం కలుగుతుంది.



Click it and Unblock the Notifications