ముదుమలై లోను, చుట్టుపక్కల అభయారణ్యాలు గల అనేక మంచి ప్రదేశాలు ఉన్నాయి. పైకర సరస్సు సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న వంతెన అనేక రకాల పక్షులు,జంతువులూ కనిపించే గొప్ప ప్రదేశం. కల్లట్టీ జలపాతం, మోయర్ నది వద్ద అనేక జంతువులూ దాహం తీర్చుకోవడానికి రావడం చూడవచ్చు, అందువల్ల ఈ ప్రదేశం కూడా జంతువులను తిలకించాలని ఆశక్తి ఉన్నవారికి మరో మంచి ప్రదేశం. తమిళనాడు పర్యాటక & డెవలప్మెంట్ కార్పోరేషన్ వారు అందించే బోట్ రైడింగ్, అడవి సఫారి, అటవీ శాఖవారు ఈ ప్రాంతంలో అత్యంత విదేశీ వృక్ష, జంతు జాలాలను వీక్షించడానికి మరో అవకాశం అందించారు. ఎవరైనా ఊటీ నుండి ముదుమలై అభయారణ్యానికి వెళ్ళేటట్లైతే, అడవులతో కూడిన కొండలు, జలపాతాల మార్గంలో ముప్పైఆరు మలుపులు ఉంటాయి. ఈ రహదారి జంతువుల, పక్షుల సహజ ఆవసంతో ఈ ప్రాంతంలో ఆధిపత్యాన్ని కలిగిఉంటుంది.



Click it and Unblock the Notifications