ముస్సూరీ వాలీ లో పర్యాటకులు తప్పక ఆనందిస్తారు. ఇది ఒక ప్రధాన సాహస క్రీడ. అనేక కొండలు ఇక్కడ ట్రెక్కింగ్ కు కలవు. పర్యాటకులు, రివర్ అగ్లార్, పార్క్ ఎస్టేట్, భద్రాజ్ ఫారెస్ట్, లాల్ తిబ్బా, నాగ తిబ్బా వంటి ప్రదేశాలలో ట్రెక్కింగ్ చేయవచ్చు. ఇక్కడ కల హిమాలయన్ అడ్వెంచర్ ఇన్స్టిట్యూట్ ట్రెక్కింగ్ ఏర్పాట్లు చేస్తుంది. ఈ సంస్థ ఇంకా రివర్ క్రాసింగ్, రాక్ క్లైమ్బింగ్, నేచర్ క్యాంపు లు కూడా నిర్వహిస్తుంది. ట్రెక్కర్లు ఇక్కడ కల కాటేజ్ లు మరియు బంగాళా లలో వారి వారి ట్రెక్కింగ్ మార్గాలలో వసతి పొందవచ్చు. అయితే, పర్యాటకులు అపాయకరమైన రంగాన్ గావ్ ప్రాంతం లో ట్రెక్కింగ్ చేయకపోవాటం మంచిది.



Click it and Unblock the Notifications