ఉత్తమ సీజన్నాగార్జునసాగర్ సందర్శించడానికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ నెలల్లో వాతావరణం చాలా బాగుంటుంది. మధ్యాహ్నాలు వెచ్చగా మరియు సాయంత్రాలు మరీ చల్లగా కాకుండా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నెలల్లో ఈ ప్రాంతం సందర్శించటానికి మరియు ప్రయాణానికి కూడా సులభంగా ఉంటుంది..
వేసవికాలం వేసవికాలంలో నాగార్జునసాగర్ చాలా వేడిగా ఉండటంవలన అక్కడ వడదెబ్బ, నిర్జలీకరణ వంటివి ఎక్కువగా ఉంటాయి. వేసవి సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే మరియు జూన్లలో ఉంటుంది. వేసవి నెలల్లో ఉష్ణోగ్రత అధికంగా 40 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వేసవి సమయంలో నాగార్జునసాగర్ ప్రయాణం మంచిది కాదు ఎందుకంటే అప్పుడు ఉన్న ఉష్ణోగ్రత దుష్ప్రభావాలను చూపుతుంది.
వర్షఋతువు ఈ పట్టణంలో వర్షఋతువు జూలై నెల నుండి మొదలవుతుంది మరియు ఆగష్టు మరియు సెప్టెంబర్ వరకు ఉంటుంది. అక్టోబర్ మరియు నవంబర్లలో కూడా సన్నజల్లులు కురుస్తుంటాయి. వర్షాకాలంలో వర్షపాతం మధ్యస్థముగా ఉంటుంది; కొన్ని సమయాల్లో అయితే తుఫాను ఉండవచ్చు. వానాకాలంలో ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతుంది.
శీతాకాలముశీతాకాలం నవంబర్ నెలలో మొదలవుతుంది మరియు ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఈ ప్రాంతంలో డిసెంబర్ మరియు జనవరి నెలల్లో అత్యంత చల్లదనంగా ఉంటుంది. ఇక్కడ శీతాకాలంలో ఉత్తర భారత దేశంలోలాగా చలి ఉండదు. ఇక్కడ చలికాలంలో అతిచల్లగా కాకుండా, సూర్యుని వేడి వెచ్చగా తగులుతూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.