Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నల్దేరా » వాతావరణం

నల్దేరా వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం: నల్దేరా సందర్శనకు మార్చ్ నుండి జూన్ నెలలు, సెప్టెంబర్ నుండి నవంబర్ నెలల మధ్య కాలం ఉత్తమమైంది.

వేసవి

నల్దేరాలో ఏడాది పొడవునా వాతావరణం తేలికగా, ఆహ్లాదకర౦గా ఉండటం వలన ఇది ఒక ఉత్తమ పర్యాటక ప్రాంతమైంది. వాతావరణం వేసవిలో ఎంతో ఆహ్లాదంగా ఉండగా, శీతాకాలంలో గడ్డకట్టించే చలితో మంచు కురుస్తుంది.వేసవికాలం (ఏప్రిల్ నుండి జూన్ వరకు) : నల్దేరా లో వేసవి కాలం ఏప్రిల్లో మొదలై జూన్ నెల వరకు ఉంటుంది. ఈ కాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 28° సెంటిగ్రేడ్ గా నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రత 28° సెంటిగ్రేడ్ గా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని వాతావరణం ఎంతో సౌకర్యంగా ఉండే ఈ కాలంలో సందర్శించడానికి పర్యాటకులు ప్రాధాన్యతనిస్తారు.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్ వరకు) : వర్షాకాలం లో నల్దేరా ప్రాంతంలో అతి తక్కువ వర్షం కురుస్తుంది.

చలికాలం

శీతాకాలం (జూలై నుండి సెప్టెంబర్ వరకు) : నవంబర్ నెలలో మొదలయ్యే శీతాకాలం నల్దేరా లో ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఇక్కడ ఈ కాలంలో ఎంతో చల్లగా ఉండి, ఉష్ణోగ్రత అతి తక్కువగా -4° సెంటిగ్రేడ్కు పడిపోతుంది. ఈ ప్రాంతంలో శీతాకాల౦లో మంచు కూడా బాగా కురుస్తుంది.