Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నల్గొండ » వాతావరణం

నల్గొండ వాతావరణం

ఉత్తమ కాలం అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు నల్గొండ సందర్శనకు ఉత్తమమైనవి. ఈ నెలలలో వాతావరణం చాల ఆహ్లాదంగా ఉండి, ఉష్ణోగ్రత కూడా భరించగల స్థాయిలో ఉంటుంది. సూర్యుడు వేడిగా కాక వెచ్చగా ఉంటాడు. గాలిలోని చల్లదనం ప్రయాణాలను, ప్రాంతాల సందర్శనను సౌకర్యవంతం చేస్తుంది. అయితే, తేలికపాటి ఉన్ని దుస్తులను తీసుకొని వెళ్ళడం సిఫార్సు చేయబడింది. 

వేసవి

వాతావరణం వేసవి కాలం నల్గొండలో వేసవి కాలం మార్చ్ నెలలో మొదలై ఏప్రిల్, మే, జూన్ నెలల వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో అతి వేడిగా ఉండే నెలలుగా ఏప్రిల్, మేలను పరిగణిస్తారు. జూన్ నెల  చివరికి వర్షాకాలం ప్రారంభమౌతుంది. వేసవికాలం చాల వేడిగా, ఆర్ద్ర౦గా, పొడిగా వుండే వాతావరణంతో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కు చేరుతుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు దాదాపు 35డిగ్రీల సేల్సియస్ కు చేరినప్పటికీ ఆర్ద్రత స్థాయి పెరుగుతుంది. వర్షాలు జూన్ నెల చివరికి మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటాయి. అలాగే అక్టోబర్, నవంబర్ నెలలలో కొద్ది పాటి జల్లులు కురుస్తాయి. ఈ ప్రాంతంలో ఒక మోస్తరు వర్షపాత౦ పడుతుంది.  

చలికాలం

శీతాకాలం శీతాకాలం నవంబర్ నెల చివరికి మొదలై ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. డిసెంబర్, జనవరి నెలలు చాల చల్లనివిగా పరిగణిస్తారు. శీతాకాలం లో ఉష్ణోగ్రత దాదాపు 22 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. శీతాకాలాలు చల్లగా ఉండక కొంత ఆహ్లాదకరం గా ఉంటాయి. సాయంత్రాలు, రాత్రుళ్ళు చల్ల బడటం వలన తేలికపాటి ఉన్ని దుస్తుల అవసరం పడవచ్చు.