యాత్రికులకు, పర్యాటకులకు ఇక్కడ కల ఆంజనేయ టెంపుల్ తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ టెంపుల్ సుమారు 1500 ఏళ్ల నాటిది. నమక్కల్ కోట దిగువ భాగంలో కలదు. నరసింహ టెంపుల్ కు సుమారు వంద మీటర్ల ఎదురుగా కలదు. ఈ టెంపుల్ లో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం. ఇది 13 అడుగుల ఎత్తు కలది. ఆంజనేయ విగ్రహం లార్డ్ నరసింహకు అభిముఖంగా వుంటుంది. ఆంజనేయుడి విగ్రహం అక్కడ కల కోటకు రక్షకునిగా వుంటుంది. అక్కడి ప్రజలను శత్రువులనుండి రక్షిస్తుందని నమ్ముతారు.