Search
  • Follow NativePlanet
Share
» »భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. నేటి నుంచి కేదార్‌నాథ్ ఆల‌యం మూసివేత‌..

భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. నేటి నుంచి కేదార్‌నాథ్ ఆల‌యం మూసివేత‌..

భ‌క్తుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. నేటి నుంచి కేదార్‌నాథ్ ధామ్ ఆలయ తలుపులు మూసివేయనున్నారు. మ‌రో ఆరునెల‌ల‌పాటు ఈ ఆల‌య త‌లుపులు తెరుచుకోవు. శీతాకాలం వస్తున్న క్ర‌మంలో అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. తగిన ఆచారాలతో ఈ ఆల‌య త‌లుపుల‌ను మూసివేయ‌నున్నారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు భూకుంత్ భైరవనాథుని ఆశీస్సులను పొందేందుకు వ‌స్తుంటారు. కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మూసే ముందు ప్రత్యేక పూజలు చేయ‌డం ఎప్ప‌టినుంచో ఉన్న ఆన‌వాయితీ.

శీతాకాలం కార‌ణంగా...

భాయ్ దూజ్ పండుగ సోదర సోదరీమణుల మధ్య పవిత్ర సంబంధాన్ని తెలిపే వేడుక‌. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల నుదుటిపై తిలకం దీద్ది వారి దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ప్రార్థ‌న‌లు, పూజ‌లు చేస్తారు. అంతేకాదు, వారితో క‌లిసి ఆ రోజంతా స‌ర‌దాగా గ‌డుపుతారు. శీతాకాలం కారణంగా ఆల‌య నిబంధనల మేర‌కు కేదార్‌నాథ్ ఆల‌యాల‌ను మూసివేస్తారు. ఇందులో భాగంగా లార్డ్ కేదార్‌నాథ్ ద్వారపాలకుడైన భుకుంత్ భైరవనాథ్ ఆలయ తలుపులు ఆరు నెలల పాటు మూసివేయ‌డం జ‌రుగుతుంది.

అందుకుగాను, ఆల‌యంలో శనివారం ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయంలో కేదార్‌బాబా పంచముఖి డోలీని కూడా ప్ర‌తిష్టిస్తారు. ఇక‌, ఈ ఆరు మాసాల పాటు, ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబా ఆరాధన, దర్శనం పూజా కార్య‌క్ర‌మాల వంట‌వి జరుగుతాయి. అదే సమయంలో బద్రీ-కేదార్ ఆలయ కమిటీ ఆలయ తలుపులు రైడా మూసివేసేందుకు ఆల‌య అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.

Alert to devotees Kedarnath temple will be closed from today

పౌరాణిక విశ్వాసాల ప్రకారం

క్యాలెండర్ ఆధారంగా చూస్తే..ఈ సంవత్సరం భాయ్ దూజ్ పండుగను ఈ నెల (నవంబర్) 3వ తేది 2024 ఆదివారం నిర్వ‌హస్తారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం భాయ్ దూజ్‌ని యమ ద్వితీయ అని కూడా పిలుస్తారు. ఈ రోజున‌ యమరాజ్ తన సోదరి యమునాజీని కలిసేందుకు వచ్చారని చెబుతుంటారు. అప్పటి నుంచి ఈ పండుగను భాయ్ దూజ్‌గా జరుపుకోవడం ఆన‌వాయితీ మారిపోయింది. ఈ పండుగ శుభ సమయంలో తిలకం పెట్టడం సోదరులకు అదృష్టాన్ని తెస్తుందని అక్కడి వారి ప్రగాఢ విశ్వాసం. భాయ్ దూజ్‌లో తిలకం వేసేంద‌కు అనువైన సమయం నవంబర్ 3న ఆదివారం మాత్రమే. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:51 నుంచి 5:43 వరకు ఉంటుంది. మధ్యాహ్నం ముహూర్తం మధ్యాహ్నం 1:10 నుంచి 3:22 వరకు, ఉండ‌గా, విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:54 నుంచి 1:54 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 1:16 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తిలకం ప్రధాన శుభ సమయమ‌ని పండితులు చెప్పుకొచ్చారు. ఇందులో సోదరీమణులు తమ సోదరులకు తిలకాన్ని వేయొచ్చు.

ప్ర‌తిరోజూ ఇన్నివేల మంది...

కేదార్‌నాథ్ ఆలయ పూజారి శివశంకర్ లింగ్‌తో పాటు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ, తీర్థ పురోహిత్ సమాజ్, పంచపాండ కమిటీ అధికారులు కూడా ఇక్క‌డికి చేరుకున్నారు. అనంత‌రం భుకుంత్ భైరవనాథ్ జలాభిషేకం ఉంటుంది. ఆ త‌ర్వాత అన్నదానం, ప్రార్థనలు సమర్పించి హవన యాగం, ప్రత్యేక పూజలు వంటివి చేస్తారు. ఇక, ఈ ఏడాది కేదార్‌నాథ్ చేరుకున్న యాత్రికుల సంఖ్య సుమారు 15.5 లక్షలు దాటిన‌ట్లు ఆల‌య అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా భోలేనాథుని ద‌ర్శ‌నం కోసం ప్రతిరోజూ సుమారు 19వేల‌ నుండి 20 వేల మంది భక్తులు కేదార్‌నాథ్ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

More News

    Read more about: kedarnath temple closure winter
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+