Search
  • Follow NativePlanet
Share
» »గుజ‌రాత్ నుంచి మ‌రో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శ్రీ‌కారం..!

గుజ‌రాత్ నుంచి మ‌రో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శ్రీ‌కారం..!

రైలు ప్రయాణాలు జీవితంలో మ‌రిచిపోలేని అనుభూతుల‌ను ఇస్తాయి. ట్రైన్ జ‌ర్నీలో ఒక లైఫ్ ఉంటుంది. ఎన్నో కథలు, మరెన్నో గాథలు, ఇంకెన్నో మధురానుభూతులు ఈ రైలు ప్ర‌యాణాల్లో మ‌న‌కు దొరుకుతాయి. ఉంటాయి. రైళ్లో వెళ్లేటపుడు కిటికీ నుంచి కనిపించే అందమైన దృశ్యాలు, తోటి ప్రయాణికులతో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణాలు చేయ‌వ‌చ్చు.

భార‌త‌దేశంలో చాలామంది రైలు ప్ర‌యాణాల‌నే ఎంచుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినపుడు రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగానే కాక, త‌క్కువ ఖ‌ర్చుతో పాటు, ఆహ్లాదకరంగా కూడా భావిస్తారు. విమానయానం, రోడ్డు మార్గాలు వంటివి ఉన్న‌ప్ప‌టికి చాలామంది ప‌ర్యాట‌కులు రైలు మార్గాల‌నే ఎంపిక చేసుకుంటారు. భారతదేశంలో ఎన్నో పట్టణాలను, మూలలను కలుపుతూ రైలు మార్గాలు ఉన్నాయి. ఎన్నో సౌకర్యాలతో కూడిన రైళ్ళు మ‌న‌దేశంలో అందుబాటులో ఉన్నాయి.

ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం ఇప్ప‌డు కేంద్ర ప్ర‌భుత్వం ఆధునాత‌న టెక్నాల‌జీతో కూడిన ట్రైన్లను ప్ర‌వేశ‌పెట్టింది. సామాన్యులు ప్ర‌యాణించే ట్రైన్ల నుంచి ధ‌న‌వంతులు ప్ర‌యాణించే ల‌గ్జ‌రీ ట్రైన్స్ కూడా మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి.

bullettrainprojectislaunchedfromgujarat

350 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించే బుల్లెట్ ట్రైన్‌..

ప్ర‌స్తుతం దేశంలో వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌ల హ‌వా న‌డుస్తోంది. ఇక త్వ‌ర‌లోనే బుల్లెట్ ట్రైన్‌లు కూడా రాబోతున్నాయి. ఇప్ప‌టికే గుజ‌రాత్‌లో అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం తుది ద‌శ‌కు చేరుకోగా, మ‌రో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కేంద్ర‌ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్ట‌నుంది. అదికూడా గుజ‌రాత్ నుంచే కావ‌డం విశేషం. అహ్మ‌దాబాద్ నుంచి ఢిల్లీకి కూడా బుల్లెట్ ట్రైన్‌ను తీసుకొచ్చేందుకు ప్ర‌తిపాదన‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం అహ్మ‌దాబాద్ నుంచి ఢిల్లీకి ప్ర‌యాణించాలంటే సుమారు ప‌న్నెండు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.

ఇక‌, ఈ బుల్లెట్ ట్రైన్‌తో సమయం కాస్తా 3.5 గంటలకు తగ్గిపోనున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు ప‌ట్ట‌ణాల‌కు ప్ర‌యాణించాలంటే సుమారు 12 గంటలు పడుతోంది. ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తే ఆ సమయం కాస్తా 3.5 గంటలకు తగ్గిపోనుంది. బుల్లెట్ ట్రైన్ ఎలివేటెడ్ కారిడార్‌లో సగటున గంటకు 350 కిలోమీట‌ర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ మేరకు రైల్వే శాఖ సమగ్ర ప్రాజెక్టు బుల్లెట్ ట్రైన్ పై ఓ నివేదికను కూడా ఖరారు చేసింది. ఈ నివేదిక‌ ప్రకారం ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ అహ్మ‌దాబాద్ నుంచి ఢిల్లీకి బ‌య‌లుదేరే క్ర‌మంలో ఈ స్టేష‌న్ల మ‌ధ్య న‌డుస్తోంది. అవే హిమ్మత్‌నగర్, ఉదయ్‌పూర్, భిల్వారా, చిత్తోర్‌గఢ్, అజ్మీర్, కిషన్‌గఢ్, జైపూర్, రేవారీ, మనేసర్ స్టేషన్లు.

bullettrainprojectislaunchedfromgujarat1

2026 నాటికి అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు సర్వీస్...

ఇక‌, ఇప్ప‌టికే తుది ద‌శ‌కు చేరుకున్న అహ్మ‌దాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ 2026 జూలై నాటికి ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక‌, అహ్మ‌దాబాద్ టు ఢిల్లీ బుల్లెట్ ట్రైన్ సర్వీసు మల్టీమోడల్ హబ్ ఏర్పాటు చేయనున్న సబర్మతి స్టేషన్ నుంచి ప్రారంభ‌మవుతుంది. ఇక‌, ఈ మార్గంలో అహ్మదాబాద్, ఢిల్లీ వంటి ప్ర‌ధాన స్టేష‌న్ల‌తో పాటు మరో తొమ్మిది ప్రధాన స్టేషన్లు కూడా ఉంటాయి.

ఈ బుల్లెట్ ట్రైన్ గరిష్టంగా గంటకు 350 కిలోమీట‌ర్ల వేగంతో ప‌రుగెడుతోంది. ఈ ట్రైన్‌ గుజరాత్, రాజస్తాన్, హరియాణా రాష్ట్రాల మీదుగా ఢిల్లీ చేరుకుంటుంది. దేశంలోని రైలు కనెక్టివిటీని పెంచేందుకు, పర్యాటక రంగాన్ని ప్రోత్స‌హించేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టిన‌ట్లు తెలుస్తోంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+