Search
  • Follow NativePlanet
Share
» »అయోధ్య రైల్వేస్టేష‌న్‌కు కొత్త‌పేరు..ఇక్క‌డి విశేషాలు ఎంటో తెలుసా..

అయోధ్య రైల్వేస్టేష‌న్‌కు కొత్త‌పేరు..ఇక్క‌డి విశేషాలు ఎంటో తెలుసా..

ఒకవైపు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంది. మరోవైపు శ్రీరాముడి దర్శనానికి వచ్చే ప్రజలకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలను పూర్తిచేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఇప్పుడు అయోధ్య రైల్వే స్టేషన్‌కు కూడా రూపుదిద్దుకుంది. విమానంలో ప్రయాణించడమంటే సామాన్యులకు ఎంతో ఖ‌రీదుతో కూడుకున్న విష‌యం. కాబ‌ట్టి చాలామంది రైలు ప్ర‌యాణాన్ని ఎంపిక చేసుకుంటుంటారు.

ఇటీవల, అయోధ్య రైల్వే స్టేషన్ పేరు కూడా మార్చబడింది, ఇప్పుడు ఈ ప్రదేశాన్ని అయోధ్య ధామ్ జంక్షన్ అని పిలుస్తున్నారు. అయోధ్య ప్రజల కోసం ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన రైల్వే స్టేషన్ తలుపులు కూడా త్వరలో తెరుచుకోబోతున్నాయి. ఈ స్టేషన్ దేశంలోని అత్యంత అందమైన మరియు ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం కాబోతుంది. ఈ అయోధ్య ధామ్ జంక్షన్‌లోని ఆధునాత‌న సౌక‌ర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ayodhyarailwaystation

మూడు ద‌శ‌ల్లో కొన‌సాగుతున్న ప‌నులు..

అయోధ్య రైల్వేస్టేష‌న్ ప‌నులు మూడు దశల్లో జరుగుతున్నాయి. తొలిదశ నిర్మాణ పనులు ఇప్ప‌టికి పూర్తయ్యాయి. పిల్లల సంరక్షణ కేంద్రం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల కోసం ప్రత్యేక క్యాబిన్‌లు, పర్యాటక సమాచార కేంద్రం అలాగే దేశంలోనే అతిపెద్ద కాన్‌కోర్స్ సెటప్ కూడా ఇక్కడ నిర్మించబడుతున్నాయి. ప్రయాణీకులకు, తల్లిపాలు తాగే పిల్లలకు ఎలాంటి వైద్య పరీక్ష‌లైనా చేయించుకోవడానికి వీలుగా ఉండేలా ఇక్క‌డ ఒక శిశు సంరక్షణ గది కూడా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. అదేవిధంగా, ప్రయాణంలో ఏ విధంగానైనా గాయపడినట్లయితే లేదా ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు గుర‌యినట్ల‌యితే ప్ర‌థ‌మ చికిత్స కోసం, వైద్య సంర‌క్ష‌ణ కోసం కూడా ఏర్పాట్లు చేశారు.

ఇది పూర్తిగా G+2 మోడల్‌లో నిర్మించ‌బ‌డింది.

అదే సమయంలో, ప్యాసింజర్ ఫెసిలిటీస్ డెస్క్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సహాయంతో, ఇక్కడికి వచ్చే ప్రయాణికులు శ్రీరామ మందిరంతో పాటు ఈ ప్రాంతంలోని ప్రతి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించడంతో పాటు అక్కడికి చేరుకోవడానికి మార్గాల గురించి కూడా సమాచారాన్ని అందించే సౌక‌ర్యాలు కూడా ఉన్నాయి. ఈ సౌకర్యాలన్నీ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటాయి. ఇది పూర్తిగా G+2 మోడల్‌లో (గ్రౌండ్ ప్లస్ మిడిల్ మరియు ఫస్ట్ ఫ్లోర్) నిర్మించబడింది. దీంతోపాటు క్లోక్ రూమ్‌లు, ఫుడ్ ప్లాజా, వెయిటింగ్ హాళ్లు, మెట్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, మరుగుదొడ్లు వంటి అనేక సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.
వసతి గృహం మొదటి అంతస్తులో ఉండ‌డంతోపాటు మధ్య అంతస్తులో కూడా ఉంది.

ayodhyarailwaystation

వికలాంగుల‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు..

అయోధ్య ధామ్ స్టేషన్ మధ్య అంతస్తులో రిటైరింగ్ రూమ్, లేడీస్ డార్మిటరీ, ఏసీ రిటైరింగ్ రూమ్‌లు, జెంట్స్ డార్మిటరీ, మెట్లు, రిలీవింగ్ స్టాఫ్ కోసం లాడ్జింగ్ రూమ్, స్టేషన్ మాస్టర్, మహిళా సిబ్బంది గది నిర్మించబడ్డాయి. అదే సమయంలో, మొదటి అంతస్తులో దేశంలోనే అతిపెద్ద కాన్‌కోర్స్ సెటప్ కూడా సిద్ధమవుతోంది. అంతే కాకుండా మొదటి అంతస్తులో ఫుడ్ ప్లాజా, వెయిటింగ్ హాల్, టాయిలెట్, డ్రింకింగ్ వాటర్, ఎస్కలేటర్లు, లిఫ్టు, స్టాఫ్ రూమ్, షాపులు, వెయిటింగ్ రూమ్, ఎంట్రీ బ్రిడ్జి వంటి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. అంతేకాకుండా వికలాంగుల కోసం అనేక ప్రత్యేక రకాల టాయిలెట్లను కూడా సిద్ధం చేశారు.

ఈ భ‌వ‌నం మ‌ధ్య‌లో భారీ ఫ్యాన్‌..

ఈ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు 2018 నుండే ప్రారంభమయ్యాయి, మొదటి దశలో నిర్మించిన భవనంలో శ్రీరామ మందిరం వంటి గొప్ప ఆకర్షణలు ఉన్నాయి. భవనంలో అమర్చిన టైల్స్, రాళ్లు, అద్దాలు, తలుపులు, లైటింగ్ మొదలైనవి ప‌ర్యాట‌కుల‌ను మంత్రముగ్ధులను చేస్తాయి. భవనం మధ్యలో ఒక భారీ ఫ్యాన్‌ను స్థాపించారు. దాని క్రింద నేల డిజైన్ ప‌ర్యాట‌కుల‌కు ఎంత‌గానో న‌చ్చుతుంది. వీటితోపాటు స్టేషన్ ప్రాంగణం వెలుపల ఉన్న పెద్ద కాంప్లెక్స్ కూడా రైల్వే స్టేషన్ వైభవానికి సాక్షిగా నిలుస్తుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+