Search
  • Follow NativePlanet
Share

అయోధ్య - ప్రఖ్యాత పుణ్య క్షేత్రం!

20

సరయు నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్య క్షేత్రం అయోధ్య. విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారం అయిన భగవాన్ శ్రీ రాముడితో ఈ పట్టణానికి ఎంతో అనుబంధం ఉంది. రామాయణం అనే ఇతిహాసం ప్రకారం శ్రీ రాముడు జన్మించిన రఘు వంశీకుల యొక్క రాజధానిగా పురాతనమైన అయోధ్య నగరం వ్యవహరించేది. రాకుమారుడైన రాముడి చుట్టూ నే రామాయణం కథ మొత్తం తిరుగుతుంది. శ్రీ రాముడు వనవాసానికి 14 ఏళ్ళ పాటు వెళ్ళి వచ్చిన తరువాత ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి పండుగని జరుపుకుంటారు.

ఆధ్యాత్మికత లో ప్రత్యేకమైన అయోధ్య నగరం

హిందూ మతం తో పాటు అయోధ్య లో బౌద్ధ మతం, జైన మతం మరియు ఇస్లాం మతం జాడలు కూడా కనిపిస్తాయి. జైన్ తీర్థంకరు ల లో అయిదుగురు ఇక్కడే జన్మించారని నమ్ముతారు. మొదటి తీర్థంకరుడు అయిన రిషబ్దేవ్ కూడా ఇక్కడే జన్మించారని అంటారు.

అయోధ్య కొన్ని చెడు అనుభవాలని కూడా రుచి చూసింది. 1527 లో శ్రీ రాముడి జన్మ స్థలం గా పరిగణించబడిన ప్రాంతం లో మొఘల్ చక్రవర్తి బాబ్రీ మసీదు ని నిర్మించాడు. 1992 లో ఈ మసీదు కొందరి చేత ద్వంసం చేయబడింది. ఆ తరువాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. టెర్రరిసం ఇంకా మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

అయోధ్యలోని పర్యాటక ప్రదేశాలు

హిందువుల యొక్క అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం అయోధ్య. ఆధ్యాత్మిత కలిగిన వ్యక్తులకి అయోధ్య పర్యాటకశాఖ ఎన్నో అందిస్తుంది. శ్రీ రాముడి పుత్రుడు కుశుడి చేత నిర్మించబడిన నాగేశ్వరనాథ్ ఆలయం మరియు చక్ర హర్జి విష్ణు ఆలయాలు ఇక్కడ సందర్శించదగిన ఆలయాలు. తులసీదాస్ యొక్క జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం చేత నిర్మించబడిన తులసీ స్మారాక్ భవన్ ఇక్కడ ఉంది. 1992 లో ద్వంసం చేయబడిన బాబ్రీ మసీదు రామ జన్మ భూమిలో ఉండేది.

బంగారపు కిరీటాలు ధరించిన సీతారాముల చిత్రాలని కనక భవన్ లో గమనించవచ్చు. హనుమాన్ గర్హి అనే భారీ నిర్మాణం ప్రతి ములలో వృత్తాకార కోట బురుజుల తో ఉంటుంది. శ్రీ రాముడి తండ్రి కి సంబంధించిన దసరథ్ భవన్ ని ఇక్కడ గమనించవచ్చు. ట్రేటా కే ఠాకూర్ అనే ప్రదేశం లో నే శ్రీ రాముడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడని తెలుస్తోంది.

రామ్ జన్మభూమి ఆలయానికి సమీపం లో సీత కి రాసోయి ని గమనించవచ్చు. శ్రీ రాముడి తో వివాహం తరువాత సీతాదేవి మొట్ట మొదటి సారి ఇక్కడే వంట చేసిందని అంటారు. సరయు నది వద్ద ఉన్న రామ్ కి పైది అనే స్నానపు ఘాట్స్ ఉన్నాయి. ఆ తరువాత, మని పర్బాత్ అనే బౌద్ధుల విహార ప్రదేశం ఉంది ఆ తరువాత హిందువుల ఆలయం గా మారింది. ఇక్కడ నుంచి ఈ నగరం యొక్క సుందరమైన వీక్షణలు చెయ్యవచ్చు.

వాతావరణం

అయోధ్య లో ఎండాకాలం, వర్షాకాలం మరియు శీతాకాలం లు కలవు.

అయోధ్య ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అయోధ్య వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అయోధ్య

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అయోధ్య

  • రోడ్డు ప్రయాణం
    బస్సు మార్గం లక్నో, అలహాబాద్, వారణాసి, గోరఖపూర్ మరియు ఇతర ప్రధాన నగరాల నుండి బస్సు సర్వీసు లు సులభం గా అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రైవేటు సంస్థల చే ఈ బస్సులు నడపబడుతున్నాయి. ఢిల్లీ వంటి నగరాల నుండి అయోధ్య కి డీలక్స్ బస్సులు అలాగే వోల్వో కోచ్ లు అందుబాటులో కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ఢిల్లీ, లక్నో, వారణాసి మరియు అల్లహాబాద్ వంటి ప్రధాన నగరాలకి అయోధ్య రైలు మార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. సమీపం లో రైల్ హెడ్స్ అలహాబాద్(జి కె ఫై ఎక్ష్ప్రెస్), కోల్కతా (దూన్ ఎక్ష్ప్రెస్), ఢిల్లీ(సరయు యమునా ఎక్ష్ప్రెస్), మరియు లక్నో (కైఫియత్ ఎక్ష్ప్రెస్) మరియు వారణాసి (మరుధర్ ఎక్ష్ప్రెస్)
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    అయోధ్య కి ఎలా చేరాలి ? వాయు మార్గం అయోధ్య నుండి 150 కిలో మీటర్ల దూరం లో ఉన్న లక్నో విమానాశ్రయం అయోధ్య కి సమీపం లో ఉన్న విమానాశ్రయం. ఇక్కడ నుండి ఏదైనా ప్రైవేటు టాక్సీ లేదా బస్సు తీసుకుని నగరానికి రావచ్చు. అమౌసి, వారణాసి మరియు కాన్పూర్ వద్ద ఉన్న దేశీయ విమానాశ్రయాలు అయోధ్య కి సమీపం లో ఉన్నవే.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue