Search
  • Follow NativePlanet
Share
» »Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరానికి త్వ‌ర‌లోనే హెలికాప్ట‌ర్‌ సేవ‌లు..

Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరానికి త్వ‌ర‌లోనే హెలికాప్ట‌ర్‌ సేవ‌లు..

అయోధ్య రామమందిర సందర్శన కోసం వెళ్లే భ‌క్తుల‌కు అయోధ్యలో త్వరలోనే హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభం కానుంది. ఈ సౌకర్యం రాజధాని లక్నో, గోరఖ్‌పూర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, మధుర, ఆగ్రా నుండి అందుబాటులోకి రానున్నాయి. ఈ హెలికాప్టర్ సేవలో, రామమందిరం, హనుమాన్‌గర్హి, సరయూతో పాటు ఇతర ప్రసిద్ధ ప్రదేశాలకు పర్యటనలు జరుగనున్నాయి. ఒక్కో భక్తుడు విమాన ప్రయాణానికి రూ.3539 ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంది.

జనవరి 22న అయోధ్యలో జరగనున్న శ్రీరామ్ లల్లా ప్రాణ‌ప్ర‌తిష్ట కోసం దేశ‌ప్ర‌జ‌లంతా ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి ప్ర‌జ‌లు విచ్చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పర్యాటక శాఖ పలు ఏర్పాట్లను కూడా చేస్తోంది. ఈ పర్యాటకాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలో హెలికాప్టర్ సేవలను కూడా ప్రారంభించ‌నున్నారు. లక్నోతో సహా ఉత్తరప్రదేశ్‌లోని 6 జిల్లాలు ఈ సేవను పొంద‌నున్నాయి. ఆ ప్ర‌దేశాలేంటో చూద్దాం..

ఈ హెలికాప్టర్ సర్వీసు జనవరి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ విమాన స‌ర్వీసులు లక్నోతో పాటు, గోరఖ్‌పూర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, మధుర మరియు ఆగ్రాల నుండి అందుబాటులో ఉండనున్నాయి. అనంత‌రం కాన్పూర్‌తో సహా ఇతర పెద్ద నగరాల్లో ఈ సౌకర్యం త్వరలో ప్రారంభించబడుతుంది.

ayodhyahelicaptorservice

లక్నో నుండి అయోధ్యకు కేవలం 45 నిమిషాల్లో

లక్నోలోని రమాబాయి మైదాన్ నుంచి భక్తులు ఈ హెలికాప్టర్ సేవలను వినియోగించుకునే అవ‌కాశం ల‌భించ‌నుంది. లక్నో నుండి అయోధ్యకు చేరుకోవడానికి సుమారు 45 నిమిషాల స‌మ‌యం పడుతుంది. దీని కోసం ఒక వ్యక్తికి ఒక మార్గంలో రూ. 14,149 ధర ఉంటుంది. తిరిగి రావడానికి ఒకే ఛార్జీని విడిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక‌, గోరఖ్‌పూర్ నుండి అయోధ్య వరకు 126 కిలోమీట‌ర్ల ప్రయాణాన్ని 40 నిమిషాల్లో పూర్తి చేసే అవ‌కాశం ఉంటుంది. ఈ యాత్రకు భక్తులు రూ.11,327 ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ సేవ‌ల‌ను పొందాల‌నుకునేవారు ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. భక్తుల సంఖ్య ప్రకారం, హెలికాప్టర్లు ప్రతిరోజూ వారి గమ్యస్థానం నుండి అయోధ్యకు చేర‌నున్నాయి.

రామ మందిరం వైమానిక దర్శనం రూ. 3,539

వీటితోపాటు అయోధ్యకు వెళ్లే రామ‌భ‌క్తుల‌కు ఇక్క‌డ రామ‌మందిర వైమానిక ద‌ర్శ‌నం కూడా ఇప్పించబ‌డుతుంది. ఇందుకోసం సరయూ కట్‌లో ఉన్న టూరిజం అతిథి గృహం నుంచి రామభక్తులు విమానంలో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు.ఇందులో రామ మందిరంతో పాటు, హనుమాన్‌గర్హి, సరయూ ఘాట్‌తో సహా ఇక్కడ ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను కూడా భక్తులు సంద‌ర్శించ‌వ‌చ్చు. రామ‌మందిరం వైమానిక ద‌ర్శ‌నం కోసం 3,5,39 రూపాయ‌ల‌ను చెల్లించాల్సి ఉంటుంది.

ఈ విమాన ప్ర‌యాణానికి ప‌దిహేను నిమిషాలు మాత్ర‌మే ప‌డుతుంది. అందుకోసం ఒక్క‌క్కొరి ఛార్జీ రూ. 3,539 గా నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. ఈ స‌ర్వీసులో ఒకేసారి 5 మంది భ‌క్తులు ఈ సౌక‌ర్యాన్ని పొందే అవ‌కాశం ఉంటుంది. ఇందులో ల‌గేజీ తీసుకెళ్లే వెసులుబాటు కూడా ఉంది. ఒక్కో భ‌క్తుడు గ‌రిష్టంగా 5 కిలోల ల‌గేజీతో ప్రయాణం చేసే అవ‌కాశం ఉంటుంది. మ‌రెందుకాల‌స్యం మీరు కూడా అయోధ్య బ‌యలుదేరుతుంటే త‌ప్పకుండా ఈ హెలికాఫ్ట‌ర్ సేవ‌ల‌ను వినియోగించుకోండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+