Search
  • Follow NativePlanet
Share
» »అద్భుత‌ అందాల నిల‌యం.. చిత్ర‌కూట్‌!

అద్భుత‌ అందాల నిల‌యం.. చిత్ర‌కూట్‌!

మ‌న‌స్పూర్తిగా ఆస్వాదించాలే కాని, చుట్టూ ఉన్న‌ ప్రకృతిలో ఎన్నో అందాలు కనిపిస్తాయి. వాటిలో జలపాతాలకు ఎప్పుడూ ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. అలా ఒక్కో జలపాతానికి ఒక్కో ప్రత్యేకత. ఒక జలపాతం ఎత్తైన పర్వతాల నుండి ఉర‌క‌లు వేస్తే, మరో జలపాతం నిశ‌బ్ధంగా సాగుతూ కనిపిస్తుంది. జలపాత ప్రాంతంతోపాటు పరిసరాలు మరింత అందంగా తీర్చిదిద్దినట్టు కనిపిస్తే పర్యాటకులకు ఆనందం అవధుల్ని దాటుతుంది. అలాంటి అందమైన జలపాతం చిత్రకూట్‌. మన భారతదేశంలో అత్యంత వెడల్పుగా విస్తరించి కనువిందుచేసే ఈ జలపాతం ఇది. సూర్యకాంతిని బట్టి ఈ జలపాతం రంగుమారుతూ క‌నువిందు చేస్తుంది. ఉషోదయాన ధవళవర్ణంలో ఉన్న ఈ జలపాతం సూర్యకాంతి తీక్షణతను బట్టి గోధుమ, నారింజ రంగులోకి మారి సూర్యాస్తమయానికి అరుణ వర్ణంలో మనోజ్ఞంగా కనిపిస్తుంది. మ‌రెందుకు ఆల‌స్యం చిత్ర‌కూట్ అందాల‌ను వీక్షిద్దాం రండి!

 అద్భుత‌ అందాల నిల‌యం.. చిత్ర‌కూట్‌!

అద్భుత‌ అందాల నిల‌యం.. చిత్ర‌కూట్‌!

ఛత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ జిల్లా, జ‌గ‌ద‌ల్‌పూర్‌కు సమీపంలో ఉంది చిత్ర‌కూట్‌. దాదాపు వంద అడుగుల ఎత్తునుండి చిత్రావతి నది జలపాతంలా ఇక్కడ జాలువారుతుంది. గుర్రపుడెక్క ఆకారంలో విస్తరించి ఉవ్వెత్తున ఎగిసిపడే ఈ జలపాత అందాల్ని తమ కెమెరాల్లో బంధించాలని ఎంతోమంది పోటీపడుతూ కనిపిస్తారు. ఈ జలపాతం వెడల్పు వర్షపాతాన్నిబట్టి మారుతూ ఉంటుంది. వర్షాకాలం అనంతరం జూలై - అక్టోబర్‌ మధ్య చిత్రావతినది వేగం పుంజుకుని వెడల్పుగా విస్తరించి ఉదృతరూపంలో ప్రవహిస్తుంది. స్పందించే మనసుండాలేకానీ ఈ జలపాతం అందాలు మాటలకందని ముగ్ధత్వంతో కనిపిస్తాయి. వర్షాకాలం తరువాత ఉదృతరూపంలో హోరున శబ్దం చేస్తూ ప్రవహించే ఈ జలపాతం నయాగరా జలపాతాన్ని తలపిస్తుంది. వేసవిలో స్వచ్ఛమైన తెల్లని రంగులో జాలువారే ఈ జలపాతం వర్షాకాలంలో గోధుమ వర్ణంలోకి మారి వింత అందంతో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తుంది. ఈ జలపాతాన్ని ఉదయమేకాక రాత్రిపూట చూసే అవకాశం ఉంది. రంగురంగుల విద్యుద్దీపాలు జలపాత ప్రాంతంలో ఏర్పాటుచేయటం వలన రాత్రికూడా ఈ జలపాతాన్ని వీక్షించవచ్చు. మధ్యాహ్న సమ యంలో సూర్యకాంతి పరావర్తనంతో అద్భుతమైన ఏడురంగుల ఇంద్ర ధనస్సు అందాల్ని మనం కనులారా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ తరచూ ఇంద్రధనస్సు ఏర్పడి ఈ పరిసరాల్ని మరింత అందంగా మార్చివేస్తుంది.

ఫ్లడ్‌లైట్ల వెలుగులో

ఫ్లడ్‌లైట్ల వెలుగులో

పైన ఉన్న విద్యుత్‌దీపాలు అలంకరించిన పార్కునుంచే కాకుండా, కింద‌కు దిగి పైనుంచి ఉవ్వెత్తున ఉర‌కలు వేస్తూ ప్రవహించే జలపాతాన్ని చూడవచ్చు. రాత్రి పూట ఫ్లడ్‌లైట్ల వెలుగులో నిశ్శబ్ద వాతావరణంలో చల్లని గాలులు వీస్తుంటే చంద్రుని వెన్నెల కాంతిలో జలపాతాన్ని వీక్షించేందుకు సంద ర్శకులు ఆసక్తి చూపుతారు. బోటింగ్‌ సదుపాయం ఉండటం వలన బోటులో పరిసరాల్లో హాయిగా షికారు చేయ‌వ‌చ్చు. రాత్రి జలపాతానికి వెళ్ళా లంటే బస్తర్‌లో బసచేసి జలపాతాన్ని మధ్యాహ్నానికి చేరి రాత్రి జలపాతాన్ని చూడవచ్చు. వర్షాకాలంలో వర్షం వలన తడిసిన రాళ్ళు గుట్టలు నాచు, పాకుడుతో ఉండటం వలన నడిచి వెళ్ళేటపుడు జారిప‌డే ప్రమాదం ఉంది. ఈ విష‌యంలో సంద‌ర్శ‌కులు ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలి.

చూడాల్సిందే

చూడాల్సిందే

అలాగే, ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బ‌స్త‌ర్ గ్రామం గురించి ఇక్క‌డ చెప్పుకోవాలి. ప్ర‌కృతి మ‌ల‌చిన ఓ అంద‌మైన కుగ్రామం ఇది. వింధ్యా పర్వత శ్రేణుల‌ నడుమ దట్టమైన అడవి మధ్య ఎన్నో సరస్సులు, కొండలు, గుట్టలు, గుహలు, జలపాతాలలో నిండిన ప్రాంతం బస్తర్‌. ఇక్కడ ఉన్న శ్రీహరి ఆలయానికి వేలకొలదీ భక్తులు వస్తుంటారు. ఆలయానికి వచ్చినవారు చిత్రకూట్‌ జలపాతాన్ని సందర్శిస్తారు. ఈ దట్టమైన అడువుల్లో టేకు, వెదురు, సాలవంటి ఎత్తైన వృక్షాలు దట్టంగా వ్యాపించి ఉంటాయి. చిత్రకూట్‌నదిని చేరేందుకు మెట్ల మార్గం ఉంది. నది ఒడ్డున ప్రభుత్వ రిసార్టులు, క్యాంపుల్లో బసచేయవచ్చు. జగ్దల్‌పూర్‌ - చిత్రకూట్‌ రోడ్డుమార్గంలో రిసార్టులు, లాడ్జిలు అందుబాటులో ఉంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+