జమ్మూ కాశ్మీర్‌లోని రుచికరమైన వంటకాలను ఎప్పుడైనా రుచి చూశారా?
భూమి యొక్క స్వర్గంగా పిలవబడే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అందమైన లోయలతో అలంకరించబడిన ఈ ప్రదేశాన్ని సందర్శించాలని దాదాపు ప్రతి సంచారి కలలు కంటారు. ఇక్కడ సందర్శించడానికి ప్రదేశాలకు కొరత లేదు. కానీ ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా ఆహారానికి కూడా ప్రసిద్ధి చెందిందని మీకు తెలుసా. శాఖాహారం నుండి మాంసాహార వంటకాల వరకు, ఇక్కడ చాలా వెరైటీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని వంటకాలు ఇక్కడికి వచ్చే పర్యాటకుల ఆకలిని తీర్చడమే కాకుండా, ఈ ప్రాంతంపు అందాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని సందర్శరించాలనుకునేవారు తప్పకుండా ఇక్కడి వంటకాలను రుచి చూడాల్సిందే.

వెన్న టీ
టిబెట్ నుండి వచ్చిన బటర్ టీ కాశ్మీర్ యొక్క ప్రసిద్ధ మరియు ప్రత్యేకమైన వంటలలో ఒకటి. ఈ పేరు వింటేనే తెలుస్తుంది. ఈ టీలో వెన్నతో పాటు ఉప్పు కూడా కలుపుతారట. ఇది ముఖ్యంగా శీతాకాలంలో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు తమ రోజును ఒక కప్పు బటర్ టీతో ప్రారంభిస్తారు. ఇక్కడికి వెళితే మాత్రం ఈ టీని సిప్ చేయడం మరవొద్దు.

మోదక్ పులావ్
మోదక్ పులావ్ జమ్మూ మరియు కాశ్మీర్‌లోని మరొక ప్రసిద్ధమైన, పర్యాటకులు ఎంతగానో ఇష్టపడే వంటకం. పులావ్ పేరు వినగానే మామూలు పులావ్ గుర్తుకువస్తుంటే, మోదక్ పులావ్ దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది పాలు, కుంకుమపువ్వు, నెయ్యి మరియు దాల్చినచెక్కతో తయారు చేయబడుతుంది. అంతేకాకుండా ఇందులో బియ్యం తర్వాత బాదం, జీడిపప్పు మరియు ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్‌ను ఇందులో వేసి వండుతారు. మోదక్ పులావ్ రుచిని పెంచేందుకు కుంకుమపువ్వు ఎంతగానో పనిచేస్తుంది. శాఖాహారులకు ఇది ఎంతో ఉత్తమ ఎంపిక.

కాశ్మీరీ రాజ్మా
చాలామంది రాజ్మాను ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. కానీ, కాశ్మీర్ రాజ్మాకు మరో విశేషత ఉంది. ఎందుకంటే ఇది మాముల రాజ్మాలా ఉండదు. ఈ ప్రాంతంలో రాజ్మాను తవా పరాటా, పూరీ, లచ్చా పరాఠా మరియు అన్నంతో వడ్డిస్తారు. ఇది లంచ్ నుండి డిన్నర్ వరకు చాలా రుచికరమైన వంటకం. ఈ వంటకం ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఎంతగానో నచ్చుతుంది.

దమ్ ఆలూ
ఈ ప్రాంతంలో అసలైన సాంప్రదాయ కశ్మీరీ వంటకాలను రుచి చూడాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చే పర్యాటకులు దమ్ ఆలూను మాత్రం మరవరు. దమ్ ఆలూలో ప్రత్యేకంగా బంగాళదుంపలను పెరుగు, అల్లం పేస్ట్, సోపు మరియు వేడి మసాలాలతో వండుతారు. అంతేకాకుండా దీనిని రోటీ లేదా నాన్‌తో వేడిగా వడ్డిస్తారు. దమ్ ఆలూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ రుచుల జాబితాలో ఖచ్చితంగా చేర్చబడుతుంది.

రోగన్ జోష్
రోగన్ జోష్ జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క ప్రసిద్ధ వంటకాల్లో ఒకటి. ఇది ముఖ్యంగా జమ్మూ మరియు కాశ్మీర్ ప్రజలకు మరియు మాంసాహారులకు ఎంతో ఇష్టమైన వంటకం. రోగన్ జోష్ అనేది సుగంధ ద్రవ్యాలు, పెరుగు మరియు ఉల్లిపాయల మిశ్రమంతో వండిన గొర్రె మాంసంతో తయారు చేయబడిన వంటకం. దాని ఆకృతి, వాసన చూస్తే దాన్ని రుచిచూడకుండా మానరు. మాంసహారులు ప్రియులైవరైనా సరే ఈవంటకాన్నితినకుండా ఇక్కడి నుండి కదలలేరు.



Click it and Unblock the Notifications













