Search
  • Follow NativePlanet
Share
» »Bullet Train: ఇండియాలోని తొలి బుల్లెట్ ట్రైన్‌...

Bullet Train: ఇండియాలోని తొలి బుల్లెట్ ట్రైన్‌...

చాలామంది ప్ర‌యాణికులు రైలు ప్ర‌యాణాన్ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. ఎందుకంటే, త‌క్కువ ఖ‌ర్చుతో సౌక‌ర్యాల‌తో సూదుర ప్రాంతాల‌కు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. రైలు ప్ర‌యాణంలో ఒక జీవితం ఉంటుంది. ఈ ప్ర‌యాణం జీవితంలో మ‌రిచిపోలేని ఎన్నో అనుభూతుల‌ను క‌ల్పిస్తుంది. ఇక్క‌డ ఎన్నో క‌థ‌లు, మ‌రెన్నో గాథ‌లు, ఎన్నో మ‌ధురానుభూతులు కూడా ఉంటాయి. రైలు ప్ర‌యాణంలో కిటికి ప‌క్క‌న కూర్చుని ప్ర‌కృతి అందాల‌ను త‌న‌వితీరా ఆస్వాదిస్తూ ప్ర‌యాణించాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు.
తోటి ప్రయాణికులతో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

ఇటీవ‌ల భార‌త‌దేశ రైల్వే ముఖ‌చిత్రంలో అనేక విధాల మార్పులు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఇండియాలో హైస్పీడ్‌, ఆధునాతన సౌక‌ర్యాల‌తో కూడిన ట్రైన్స్ ప‌ట్టాలెక్కుతున్నాయి. అందులో ముఖ్యంగాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్రారంభించిన వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌వంటివి. ఈ ట్రైన్ ప్ర‌యాణికుల‌కు ఎంతో సౌక‌ర్యంగా ఉంది. ఇది ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ వివిధ దేశాలకు ప‌రిమిత‌మైన బుల్లెట్ ట్రైన్స్ త్వ‌ర‌లో ఇండియాలో కూడా ప‌రుగులు పెట్ట‌బోతున్నాయి.

firsteverbullettrainfrommumbaitoahmedabad

మొద‌టి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ...

ఇండియాలో మొద‌టి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పనులు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడర్‌ పేరుతో మొద‌టి బుల్లెట్ ట్రైన్‌ సేవలను అందుబాటులోకి తీసుక‌రానున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన బ్రిడ్జిలను ఇప్ప‌టికే దాదాపు పూర్తి చేశారు. ఈ క్ర‌మంలో తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోష‌ల్‌మీడియాలోని ఎక్స్ వేదిక‌గాగా పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారింది. తమ ప్రభుత్వం కలలను కాదు, వాస్తవాలను సృష్టిస్తోంది అంటూ అశ్వినీ వైష్ణవ్‌ ఈ వీడియోను సోష‌ల్‌మీడియాలో షేర్‌ చేశారు. దీంతో పాటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ పాల‌న‌లో బుల్లెట్ ట్రైన్ కోసం ఎదురుచూడండి అంటూ పోస్ట్ ను షేర్ చేశారు.

firsteverbullettrainfrommumbaitoahmedabad

ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.1.08 లక్షల కోట్ల...

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విడుద‌ల చేసిన వీడియోలో ఈ బుల్లెట్ ట్రైన్‌.. గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకుపోతుంది. 2 గంటల్లోనే 508 కిలోమీట‌ర్లు ప్రయాణించనుంది. నదులపై 24 వంతెనలు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దేశంలోని తొలిసారి స్లాబ్‌ ట్రాక్‌ సిస్టమ్‌, భూకంపాలను ముందుగానే గుర్తించేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ ట్రైన్ కోసం ప్ర‌త్యేకంగా 28 స్టీలు వంతెనలు, ఏడు సొరంగాలు, సముద్ర గర్భంలో ఏడు కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌, అత్యాధునిక సదుపాయలతో కూడిన 12 రైల్వే స్టేషన్లు కూడా నిర్మించ‌నున్నారు. ఇంకా ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలకు ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో చూడ‌నున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1.08 లక్షల కోట్లను ఖ‌ర్చుచేయ‌నున్నారు. ఈ రైలు మొదటి ట్రయల్‌ రన్‌ను 2026లో చేపట్టనున్నారు.

508 కిలోమీట‌ర్ల పొడవు...

నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ముంబై - అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీట‌ర్ల పొడవుతో భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించ‌నుంది. గుజరాత్‌లోని తొమ్మిది జిల్లాలు, మహారాష్ట్రలోని మూడు జిల్లాల గుండా ఈ ట్రైన్ 352 కిలోమీట‌ర్ల మార్గం గుండా ప్ర‌యాణించ‌నుంది. మహారాష్ట్రలో ప్రాజెక్టు మొత్తం పొడవు 156 కిలోమీట‌ర్ల‌. నాగర్ హవేలీలో 4 కిలోమీట‌ర్లు. ఈ ఎనిమిది జిల్లాల్లోనూ ప్రాజెక్టు పనులు ఇప్ప‌టికే ప్రారంభమయ్యాయి. ఈ కారిడార్‌లో మొత్తం 12 స్టేషన్లను నిర్మించ‌నున్నారు. బుల్లెట్ రైలు వేగం గంటకు 320 కిలోమీట‌ర్లుగా ఉండ‌నుంది. ఈ ట్రైన్ రెండు గంటల్లో ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకుంటుంది

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+