Search
  • Follow NativePlanet
Share
» »అయోధ్య‌లోని శ్రీ‌రామ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్ర‌త్యేక‌తలు..

అయోధ్య‌లోని శ్రీ‌రామ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్ర‌త్యేక‌తలు..

అయోధ్యలో రామ‌మందిరం ప్రారంభోత్స‌వానికి ముందే అయోధ్య రైల్వేస్టేష‌న్‌ను, అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి తేనున్నారు. అందుకోసం ఏర్పాట్ల‌న్నీ పూర్తికానున్నాయి. ఇక‌, ఇందుకోసం డిసెంబ‌ర్ చివ‌రిలో అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను, రైల్వేస్టేష‌న్‌ను ప్రారంభించ‌నున్నారు. డిసెంబ‌ర్ 30 వ తేదిన ఢిల్లీ నుంచి అయోధ్య‌కు మొద‌టి విమానం బ‌య‌లుదేర‌నుంది. అందుకోసం ఏర్పాట్ల‌ను ముమ్మురంగా సాగ‌నున్నాయి. అయోధ్య‌లోని శ్రీ‌రామ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌య ప్ర‌త్యేక‌త‌లేంటీ, విమానాల ఛార్జీలెంటో వాటి గురించి తెలుసుకుందాం.

అయోధ్య‌లోని శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్ర‌యాణికుల కోసం సిద్ధంగా ఉంది. డిసెంబరు 30న ఢిల్లీ నుండి మొదటి విమానం ఈ విమానాశ్రయంలో దిగుతుంది. ఇండిగో యొక్క మొదటి వాణిజ్య విమానం జనవరి 6 న అయోధ్యకు వెళ్ల‌నుంది. ఆ తర్వాత జనవరి 11 నుండి అహ్మదాబాద్ నుండి విమానాలు ప్రారంభం కానున్నాయి.

జనవరి 6 నుండి 9వ తేదీ వరకు ప్రతిరోజూ ఒక విమానం మాత్రమే ఢిల్లీ నుండి అయోధ్యకు ప్ర‌యాణించ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే ఇండిగో మాత్రం జనవరి 10 నుండి అయోధ్యకు రోజువారీ వెళ్లే విమానాల‌ను ప్రారంభించ‌డం జ‌రుగుతుంది. అయితే, అది కూడా ఢిల్లీ నుండి మాత్ర‌మే, అహ్మదాబాద్‌కు వారానికి మూడు విమానాలు ప్రారంభమవుతాయి.

sriraminternationalairportinayodhya

ఫ్లైట్ టిక్కెట్ ఎంత‌..?

అయోధ్య నుండి ఢిల్లీకి దాదాపు రూ. 3600 ధర ఉంటుందని స‌మాచారం. అయితే, అయోధ్య‌లోని రామమందిరం ప్రారంభోత్స‌వం నాడు మాత్రం ఈ ధ‌ర కాస్త ఎక్కుగానే ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆ స‌మ‌యంలో రెండు రోజులకు అంటే జనవరి 20న టిక్కెట్ ధర రూ. 12000 కంటే ఎక్కువగా ఉండ‌నుందని స‌మాచారం.

దేవాల‌యాన్ని త‌ల‌పించే ఎయిర్‌పోర్ట్‌..

విమానాశ్రయం అయోధ్య మెరుగైన రహదారితో అనుసంధానించబడింది. అయోధ్యలో నిర్మించబడుతున్న శ్రీ రామ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద బన్సీ పహర్‌పూర్ చెక్కిన రాళ్లను ప‌ర్యాట‌కులు చూడొచ్చు. రామ మందిర నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ల‌నే ఇక్క‌డ వినియోగించ‌డం జ‌రిగింది. అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం అచ్చం దేవాల‌యాన్ని పోలీ ఉంటుంది.

రామమందిరం నమూనా ప్రకారం ఈ ఎయిర్‌పోర్టును రూపకల్పన చేయ‌డం జ‌రిగింది. ఈ విమానాశ్రయం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. 500 మంది ప్రయాణికులు ప్రయాణించే విధంగా ఈ విమానాశ్రయాన్ని రూపొందించారు. విమానాశ్రయంలో ప్రజలకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కూడా లభిస్తాయి.

sriraminternationalairportinayodhya1

అయోధ్యకు ఎలా చేరుకోవాలి

విమాన మార్గం : అయోధ్య నుండి గోరఖ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకోవాలంటే సుమారు 118 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. అమౌసి విమానాశ్రయం, లక్నో అయోధ్య నుండి 125 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది.

ఇక రైలు మార్గం ద్వారా అయితే, దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుండి అయోధ్యకు సాధారణ రైళ్లను సులభంగా పొందవచ్చు. స‌మీప రైళ్లు.. అయోధ్య జంక్షన్ (AY), ఫైజాబాద్ జంక్షన్ (FD)
ఇక రోడ్డు మార్గం ద్వారా అయితే, ఉత్తరప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు సర్వీసులు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. మరియు అన్ని ప్రాంతాల నుండి ఇక్క‌డికి చేరుకోవడం చాలా సులభమ‌నే చెప్పుకోవాలి.

లక్నో నుండి 130 కిలోమీట‌ర్లు, వార‌ణాసి నుండి 200 కిలోమీట‌ర్లు, అల‌హాబాద్ నుండి 160 కిలోమీట‌ర్లు, గోరఖ్‌పూర్ నుండి 140 కిలోమీట‌ర్లు, ఢిల్లీ నుండి 636 కిలోమీట‌ర్లు, లక్నో, ఢిల్లీ, గోరఖ్‌పూర్ నుండి తరచుగా బస్సులు అందుబాటులో ఉంటాయి. వారణాసి, అలహాబాద్, ఇతర ప్రాంతాల నుండి బస్సులు కూడా వారి సమయానికి అనుగుణంగా నడుస్తాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+