Search
  • Follow NativePlanet
Share
» »Garden Tourism Festival: దేశ రాజ‌ధానిలో ఫిబ్ర‌వ‌రి 16 నుండి గార్డెన్ టూరిజం ఫెస్టివల్...

Garden Tourism Festival: దేశ రాజ‌ధానిలో ఫిబ్ర‌వ‌రి 16 నుండి గార్డెన్ టూరిజం ఫెస్టివల్...

శీతాకాలం ముగిసి వేసవి రాక మధ్య కాలం ఎంతో ఆహ్లాద‌భ‌రింతంగా ఉంటుంది. వసంతం రాక అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ కాలంలో చెట్లు మరియు మొక్కలు రంగురంగుల పూలతో నిండి ఉండ‌డం మ‌నం చూస్తుంటాం. వీటిని చూస్తుంటే వేరే ప్ర‌పంచంలోకి వెళ్లిన అనుభూతి క‌లుగుతుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని అమృత్‌ ఉద్యానవనం ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ వివిధ ర‌కాల పూల‌ను చూడొచ్చు. ఇలాంటి ప్ర‌దేశ‌మే మ‌రొక‌టి ఢిల్లీలో ఉంది. అక్క‌డ కూడా విభిన్న‌ర‌కాల మొక్క‌లు, పూల‌ను ఈ కాలంలో చూడొచ్చు. అదే గార్డెన్ టూరిజం ఫెస్టివ‌ల్.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో గార్డెన్ టూరిజం ఫెస్టివల్ ఫిబ్రవరి 16 నుండి ప్రారంభం కానుంది. ఇది ఫిబ్రవరి 18 వరకు కొనసాగుతుంది. ఈ పండుగలో ప‌ర్యాట‌కులు అనేక రకాల పూలు మరియు మొక్కలను ప్ర‌త్యక్షంగా వీక్షించొచ్చు. ఫోటోగ్ర‌ఫీ ప్రేమికుల‌కు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ద‌నే చెప్పుకోవాలి. వీటితో పాటు ఇక్క‌డ విభిన్న‌ర‌కాల వంట‌కాల రుచుల‌ను కూడా టేస్ట్ చేయొచ్చు. టిక్కెట్‌తో పాటు ఇతర ముఖ్యమైన సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ గార్డెన్ ఫెస్టివ‌ల్‌ను ఢిల్లీ టూరిజం డిపార్ట్‌మెంట్ వారు నిర్వహిస్తున్నారు. ప్ర‌తి ఏటా జ‌రిగే వార్షిక ఉత్సవం ఇది. ఇందులో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ రకాల పువ్వులు మరియు మొక్కలను ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచుతారు. ఈ పండుగలో, పర్యాటకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, పోటీలు కూడా నిర్వహించబడతాయి. ఇక్క‌డ విభిన్న‌ర‌కాల వంట‌కాలు, పానీయాలు కూడా అందుబాటులో ఉంటాయి.

gardentourismfestival , delhi

ఈ ఫెస్టివ‌ల్ ప్రారంభం ఎప్పుడు జ‌రిగింది.?

గార్డెన్ టూరిజం ఫెస్టివల్‌ను 2004లో మాజీ ముఖ్యమంత్రి దివంగత శ్రీమతి షీలా దీక్షిత్ ప్రారంభించారు. పర్యావరణం మరియు ఉద్యానవనాలపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ పండుగను ప్రారంభించడం జ‌రిగింది. ఈ ఫెస్టివ‌ల్ ప్రకృతి ప్రేమికులకు ఎంతో అనువైన‌ది మ‌రియు ప్ర‌త్యేక‌మైన‌ద‌ని చెప్పుకోవాలి. ఇది కుతుబ్ హెరిటేజ్ జోన్ సమీపంలో ఉన్న 20.5 ఎకరాల ఉద్యానవనంలోని గార్డెన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్‌లో నిర్వహించబడుతుంది.

ఈ ఫెస్టివ‌ల్ ఎన్నిరోజులు ఉంటుంది..?

2024లో జ‌రిగే గార్డెన్ టూరిజం ఫెస్టివ‌ల్ 36వ పండుగ‌. ఈ గార్డెన్ టూరిజం ఫెస్టివల్ ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 18, 2024 వరకు జరుగుతుంది. ఈసారి ఈ పండుగ థీమ్‌ను 'పువ్వుల మధ్య భూమి నవ్వుతుంది' అని ఉంచారు. పండుగలో అనేక రకాల అందమైన పూలను చూసే అవకాశం ప‌ర్యాట‌కుల‌కు లభిస్తుంది. ఈ ఫెస్టివల్‌లో వివిధ రకాల డహ్లియాస్, టెర్రిరియంలు, ఔషధ మొక్కలు, ఆకులు, మూలికా మొక్కలు, కాక్టస్, బోన్సాయ్, బోగెన్‌విల్లా, కూరగాయలు మరియు ఇండోర్ మరియు అవుట్‌డోర్ మొక్కలను కూడా ప్రదర్శించ‌డం జ‌రుగుతుంది. ఇందులో 500కు పైగా రకాల మొక్కలు నాటనున్నారు.

gardentourismfestival

ఫెస్టివ‌ల్ ప్రత్యేకత‌లు..

ఈ ఫెస్టివ‌ల్‌కు విచ్చేసే ప‌ర్యాట‌కుల కోసం ఫ్లవర్ షోతో పాటు పలు రకాల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. పిల్లల కోసం అడ్వెంచర్ పార్క్ కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. ఫిబ్రవరి 17న చిన్నారులకు పెయింటింగ్ పోటీలు, ఫిబ్రవరి 18న మ్యాజిక్ షో నిర్వహించనున్నారు. వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించనున్నారు. మినీ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఇక్క‌డ నిర్వహించబడుతుంది. ఈ ఫుడ్ ఫెస్టివ‌ల్‌లో అనేక రకాల వంటకాలను టేస్ట్ చేయొచ్చు.

సంద‌ర్శ‌న స‌మ‌యం...

ప‌ర్యాట‌కులు ఈ ఫెస్టివ‌ల్‌ను ఉద‌యం 11:00 నుండి సాయంత్రం 6:00 వరకు సందర్శించవచ్చు. ఇక్కడ టికెట్ ధర వారం రోజుల్లో ఒక్కొక్కరికి రూ.40, వారాంతాల్లో రూ.50గా నిర్ణ‌యించారు. 12 ఏళ్లలోపు పిల్లలు మరియు సీనియర్ సిటిజన్లు ఉచితం.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+