Search
  • Follow NativePlanet
Share
» »శ్రీ‌రాముని భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక‌నుంచి వారికి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం..

శ్రీ‌రాముని భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక‌నుంచి వారికి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం..

దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక ప్ర‌దేశాలు ఉన్నాయి. భార‌త్‌లోని ఒక్కో ప్రాంతం ఒక్కో దేవునికి ప్ర‌సిద్ధిచెందింది. అయోధ్య‌లో బాల‌రాముడు ఎంతో ప్ర‌సిద్ధి. ఇక‌, దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో శ్రీ‌రాముని ఆల‌యాలు కొకొల్ల‌లు. ద‌క్షిణాదిలో అయోధ్య‌గా పేరుగాంచిన ఆల‌యం గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. అదే తెలంగాణ‌లో ప్ర‌సిద్ధిచెందిన భ్ర‌దాచ‌లం రాములోరి ఆల‌యం.

దేశంలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం. ఈ ఆల‌యం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో పావన గోదావరి నది తీరాన వెలసింది. ఈ ఆల‌యానికి ఎన్నో యేళ్ల పురాత‌న చ‌రిత్ర ఉంది. భ‌ద్రాచ‌లంలోని ఈ దేవాల‌యంలో సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉంటారు. ఈ ఆల‌యంలో ఒక్క తెలంగాణ‌లో కాకుండా ద‌క్షిణాదిలో ఎంతో ప్ర‌సిద్ధిచెందింది.

ఈ ఆల‌యంలో రాములోరి ద‌ర్శ‌నానికి ప‌క్క రాష్ట్రాల వారు కూడా త‌ర‌లివ‌స్తుంటారు. ఇక్క‌డి శ్రీ‌రాముని వైకుంఠ‌రామునిగా కొలుస్తుంటారు. ఇక్క‌డ సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు విగ్రహాలు మ‌న‌కు క‌నిపిస్తాయి. ఇదే ఇక్క‌డి ప్ర‌త్యేక‌త‌. అంతేకాదు ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకాన్ని ఎంతో వైభవంగా నిర్వ‌హిస్తారు. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో భ‌క్తుల సంద‌ర్శ‌నార్థం ఇక్క‌డ ప్రదర్శనకు ఉంచుతారు.

నూత‌న విధానాలు..

నిత్యం ఈ ఆల‌యానికి భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. భ‌క్తుల సంద‌ర్శ‌నార్థం ఇక్క‌డ అన్నీ ఏర్పాట్లు చేశారు. తాజాగా, ఇక్క‌డ నూత‌న విధానాల‌కు ఆల‌య అధికారులు శ్రీ‌కారం చుట్టారు. శ్రీ‌రాముని సంద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎటువంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా పలు కొత్త విధానాల‌ను తీసుకొచ్చారు. ఇక‌నుంచి ఆల‌యానికి వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు ప్రొటోకాల్ ద‌ర్శ‌నంతోపాటు, వృధ్ధులు, పిల్ల‌లు, ప‌సిపిల్ల‌ల త‌లుల్లు, న‌డ‌వలేని వారికి నేరుగా రాములోరి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

నిన్న‌(ఆదివారం) తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఆల‌యంలో ఈ నూత‌న విధానాల‌ను అమ‌లు చేస్తున్నారు.

ramlallaspecialdarshan1

ఆ స‌మ‌యాల్లో మార్పులు..

ఆలయంలో శ్రీ‌రాముని ద‌ర్శ‌నార్థం వ‌చ్చే వీఐపీలకు ప్రోటోకాల్ దర్శనం కూడా ఉండనుంది. వీటితోపాటు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని వారు, చంటి పిల్లల తల్లులు ఇక నుంచి నేరుగా దర్శనం చేసుకోవ‌చ్చ‌ని ఆల‌య అధికారులు తెలిపారు. భక్తుల తాకిడి ఉన్నప్పుడు బేడా మండపంలో వేచి ఉండేందుకు సదుపాయాలు కల్పించనున్నారు. వీరికి సాయంగా వచ్చే వారికి కూడా దర్శన సదుపాయాన్ని క‌ల్పించిన‌ట్లు ఆల‌య అధికారులు వివ‌రించారు. అయితే, ఆలయంలో ముఖ్య ఉత్సవాలు, విశేష రోజుల్లో ఈ విధానాల్లో ప‌లు మార్ప‌లు ఉండ‌వ‌చ్చ‌ని ఆల‌య ఈవో తెలిపారు.

వృద్ధుల‌కు, పిల్ల‌ల‌కు స్పెష‌ల్ ద‌ర్శ‌నం..

వీఐపీల‌కు ప్రొటోకాల్ ద‌ర్శ‌నంతో పాటు వృద్ధుల‌కు ప‌సిపిల్ల‌ల‌కు వారి త‌ల్లుల‌కు, న‌డ‌వ‌లేని వారికి కూడా స్పెష‌ల్ ద‌ర్శ‌నం ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ఇక‌, ప్రోటోకాల్ ద‌ర్శ‌నం చేసుకోవాల‌నుకునే వారు, అర్హత ఉన్న ప్రముఖులు ముందుగా కార్యాలయంలో తమ వివరాలను అందించి రసీదు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఆల‌య అధికారులు త‌గు ఏర్పాట్లు కూడా చేశారు. అందుకోసం ఆల‌యంలోని చిత్రకూట మండపం ఎదుట గోకులం పక్కనున్న విభాగాన్ని ప్రొటోకాల్‌ ఆఫీసుగా ఏర్పాటు చేశారు. ప్రొటోకాల్‌ అర్హత ఉన్న ప్రముఖులు ముందుగా ఈ కార్యాలయంలో తమ వివరాలను ఇచ్చి రసీదు తీసుకోవాలి. ఆ రసీదు ఆధారంగా కోరుకున్న దర్శనం, పూజ చేయించుకునే వెసులుబాటు వీఐపీల‌కు ఉంటుంది.

More News

Read more about: ayodhya uttar pradesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+