Search
  • Follow NativePlanet
Share
» » అరుదైన జీవరాశుల ఆవాసం.. హోప్ ఐలాండ్! (రెండ‌వ

అరుదైన జీవరాశుల ఆవాసం.. హోప్ ఐలాండ్! (రెండ‌వ

హోప్ ఐలాండ్‌కు చేరుకునేందుకు బోట్‌లో ముందుకు వెళ్తూ ఉంటే సముద్రానికి ఎదురెళుతోన్న ఫీలింగ్ కలిగింది. కాస్త దూరంలో కిలోమీటరు పొడవున ఉన్న ఒక రక్షణ గోడ కనిపించింది. పోర్టులో ఉండే షిప్‌ల‌కు అలల తాకిడిని తగ్గించేందుకు, అలాగే పోర్టు రక్షణ కోసం 1992లో దీనిని నిర్మించారంట..! దీని నిర్మాణం కోసం వాడిన ఒక్కో రాయి 18 టన్నుల బరువు ఉంటుందని సహాయకుడు చెప్పాడు. దాని పక్క నుంచే బోటు వెళ్తుంది. ఆ గోడ దాటగానే బోటుకు అలల తాకిడి ఎక్కువైంది. అటూ ఇటూ కాస్త ఊగింది. అంతే ఒక్కసారిగా అందరూ ఊయల ఊగుతున్నట్లుగా ఉత్సాహంగా.

ఆవాసం.. హోప్ ఐలాండ్! (రెండ‌వ భాగం)

ఆవాసం.. హోప్ ఐలాండ్! (రెండ‌వ భాగం)

ఫీలయ్యారు. యువకులు కేరింతలు ఎక్కువయ్యాయి. కాస్త దూరం వెళ్లాక, మేం డ్రైవర్ దగ్గరకు వెళ్లాం. ఎలా డ్రైవ్ చేస్తున్నాడో చూశాం. అంతేకాదు డ్రైవింగ్ ఎలా చేయాలో వివరించాడు. అప్పటికే బోటు బయల్దేరి 20 నిమిషాలు దాటింది. కొంత దూరం వచ్చాక సముద్రంలో నిలిచిపోయిన ఒక పెద్ద షిప్ కనిపించింది. ఫెతాయ్ తుపాను సమయంలో ఈ షిప్‌కు కింద ఏదో తగిలి ఇక్కడ నిలిచిపోయిందంట! దీనిని కదిలించాలంటే కొన్ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుందని చెప్పాడు. అలా మాటల్లోనే చుట్టూ సముద్రం దూరంగా కనిపించే షిప్‌లు, అలలపై ఊయలూగుతూ సాగుతున్నబోటు ప్రయాణం అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది. ఇంతలో చేరుకోవాల్సిన దీవి రానే వచ్చింది.

ఎపి టూరిజం వాళ్ల ఏర్పాట్లు

ఎపి టూరిజం వాళ్ల ఏర్పాట్లు

గ‌ట్టు ప‌క్క‌గా కింద చూస్తుంటే అలలు తాకి వెళ్తున్న చిన్న చిన్న రాళ్లు, వాటిపై రకరకాల జీవరాశులు కనిపించాయి. అరుదుగా కనిపించే ఎర్ర పీతలు అందరినీ ఉత్సాహపర్చాయి. మళ్లీ సహాయకుడు నిబంధనలు గుర్తుచేస్తూ 'అదిగో చూడడండి అటు పక్క ఎవరూ వెళ్ల్ళొద్దు.. దయచేసి సముద్రంలో దిగకండి' అంటూ హెచ్చరించాడు. అక్కడ ఎపి టూరిజం వాళ్లు పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను వివరించారు. టెంట్స్‌ పక్కనే మొబైల్ బాత్రూమ్‌లు చూపించాడు. సమయం 10.45 అయ్యింది. అందరూ ఒంటిగంట కల్లా మళ్లీ బోటు వద్దకు రావాలని చెప్పాడు.

ఆ భ‌యం.. కంగారూ.. పోయాయి..

ఆ భ‌యం.. కంగారూ.. పోయాయి..

బీచ్ లో నడుస్తూ ముందుకు సాగాం. ఆ పక్కనే చిన్న చిన్న రాళ్ల స్తంభాలు ఉన్నాయి. బహుశా అవి బ్రిడ్జి కోసం వేసినవేమో... దారి మధ్యలో రకరకాల గవ్వలు, శంఖాలను సేకరించాం. మా బృందానికి ఒక పెద్ద శంఖం దొరికింది. ఇసుకలో ప్రయాణం... పైన ఎండతో మా కాళ్లు వేగంగా ముందుకు కదిలాయి. లైట్ హౌస్ కనిపించింది. అది కొంచెం శిథిలమైంది. లైట్ హౌస్ కిందకు దూరి, అంతా సెల్ఫీలు దిగారు. పర్యాటకుల కోసం వేసిన టెంట్లో కాసేపు సేదతీరాం.. అవి ఎంతో చల్లగా, హాయిగా ఉన్నాయి. ఎర్రటి పీతలు మా. అడుగుల శబ్దానికి సముద్రంలోకి పరుగులు తీస్తున్నాయి.. వాటిని వెంబడించి కొందరు యువకులు పట్టుకుని, సెల్ఫీలు దిగారు. సమయం 12.45 అవ్వడంతో సందర్శకులందరూ బోటు ఎక్కాలని పిలుపొచ్చింది. మళ్లీ 45 నిమిషాల అలలపై ప్రయాణం. ముందు ఉన్న కంగారు, భయం ఇప్పుడు ఎవరిలోనూ కనిపించలేదు. ప్రయాణమంతా ఆనందంగా, ఆహ్లాదంగా సాగిపోయింది. బోటు గట్టుకు చేరుకుంది. క్షేమంగా తీసుకెళ్లి, తీసుకొచ్చినందుకు అందరం డ్రైవర్, సహాయకులకు కృతజ్ఞతలు తెలిపాం.

గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు

గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు

హోప్ ఐలాండ్ జర్నీ ఎంతో ఆహ్లాదభరితంగా, ఆనందంగా సాగిపోయింది. మంచినీళ్లు, తినడానికి ఏమైనా మన వెంట తీసుకెళ్లాలనే విషయం మర్చిపోవద్దు. అంతేకాదు, సొంత వెహికల్. అయితే మంచిది. లేదంటే పోర్టు వరకూ సర్వీస్ అనేది లేదు. ఆటో గానీ, క్యాబ్‌ గానీ మాట్లాడు కోవాల్సిందే.. స్టేషన్ నుంచి పోర్టుకి ఆటో రూ.150 తీసుకుంటారు. మళ్లీ అక్కడ నుంచి వెహికల్స్ ఉండవు. ఆటో కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిందే. అలాగే ఐలాండ్లో ఇంకొన్ని టెంట్స్ వేసి, రిసార్ట్స్ ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముంది. అయితే, ఈ దీవిలో అత్యధిక శాతం అటవీ విభాగం ఉంది. రిసార్టులు కడితే ఇక్కడున్న జంతువులకు, జీవరాశులకు, పర్యావరణానికి హాని కలుగుతుందని ఆటవీశాఖ అభ్యంతరాలు చెబుతుందట! అదీ ఆలోచించాల్సిన విషయమే మరి! మరెందుకు ఆలస్యం. మీ ప్ర‌యాణాన్ని మొదలు పెట్టండి!

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+