Search
  • Follow NativePlanet
Share
» »ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం గురించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు!

ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం గురించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు!

ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం గురించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు!

వంద‌ల కొద్దీ కార్లు.. అవికూడా పురాత‌న మోడ‌ల్స్‌.. ఎక‌రాల విస్తీర్ణంలో పార్కింగ్ చేసి ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ అద్భుత‌మైన ప్ర‌దేశం గురించే చెప్పుకోబుతున్నాం. అదే గుజ‌రాత్‌లోని ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం. అహ్మ‌దాబాద్‌లోని క‌థ్వాడాలో ఉన్న ఈ ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియాన్ని భోగిలాల్ తన 2,200 ఎకరాల విస్తీర్ణంలో 1927లో వ్యక్తిగత ఎస్టేట్‌లో ప్రారంభించాడు.

అయితే, 1987లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ గ్యారేజీకి యజమానిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ జాబితాను సంపాదించాడు భోగిలాల్‌. అంతేకాదు, భోగిలాల్ 204 కంటే ఎక్కువ కార్లను సేకరించాడు.

అన్ని కార్లు ఫుల్ కండిష‌న్‌లో ఉంటాయ్ మ‌రి

అన్ని కార్లు ఫుల్ కండిష‌న్‌లో ఉంటాయ్ మ‌రి

ఏదో కార్ల‌ను సేక‌రించి, చేతులు దులుపుకోలేదండోయ్‌. ఈ ఎస్టేట్‌లో సంద‌ర్శ‌కుల కంటికి క‌నిపించే ప్ర‌తి కారూ.. ఎంత పాత‌దైనా అది ఫుల్ కండిష‌న్‌లో ఉంటుందంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం గురించిన మ‌రింత‌ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇక్క‌డికి వచ్చే సంద‌ర్శ‌క‌లు వారికి న‌చ్చిన.. వారు మెచ్చిన కారులో స‌ర‌దాగా షికారుల‌కు వెళ్లే అవ‌కాశాన్ని కూడా క‌ల్పిస్తున్నారు ఇక్క‌డి నిర్వాహ‌కులు. అందుకోసం 3.5 కిలోమీట‌ర్ల దూరం రైడ్‌కు ఐదు వంద‌ల రూపాయల వ‌ర‌కూ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇక్క‌డ ఫోటోలు తీసుకునేందుకు కూడా వంద రూపాయలు చెల్లించాలి.

మ్యూజియంలో ఒక ఫలహారశాల ఉంది. ఇక్కడ న‌చ్చిన ఫుడ్ ఆర్డ‌ర్ చేసుకుని కార్ల‌కు సంబందించిన ముచ్చ‌ట్లు చెప్పుకోవ‌చ్చు.

ప్రవేశ రుసుము, సమయాలను ప‌రిశీలిస్తే.. ఒక్క‌క్క‌రికీ ప్ర‌వేశానికి 50 రూపాయ‌లు చెల్లించాలి. ఇది ఉదయం 8 గంటల నుండి సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. మ్యూజియం ముగింపు సమయం రాత్రి 9 గంటలు.

ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం ఎలా చేరుకోవాలి

ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం ఎలా చేరుకోవాలి

లు మార్గం:- మ్యూజియంకు సమీప రైల్వే స్టేషన్ నరోడా రైల్వే స్టేషన్. ఇది 3 కి.మీ దూరంలో ఉంది.

బస్సు ద్వారా : ఆటో వరల్డ్‌కి సమీప బస్ స్టాప్ 10 నిమిషాల నడక దూరంలోనే ఉంది.

సమీపంలోని ప్రసిద్ధ ప్రదేశాలు..

సమీపంలోని ప్రసిద్ధ ప్రదేశాలు..

హథీ సింగ్ జైన్ టెంపుల్ ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం నుండి 9.9 కి.మీ

బాయి హరిర్ నివావ్ (స్టెప్‌వెల్) ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం నుండి 8.6 కి.మీ.

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ మెమోరియల్ ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం నుండి 9.6 కి.మీ.

కాలికో మ్యూజియం ఆఫ్ టెక్స్‌టైల్స్ ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం నుండి 9 కి.మీ
ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం నుండి రివర్ ఫ్రంట్ ఫ్లవర్ పార్క్ 5.7 కి.మీ
మినీ కంకారియా ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం నుండి 3.8 కి.మీ
నరోడా సరస్సు ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం నుండి 3.8 కి.మీ
ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం నుండి 9.3 కి.మీ దూరంలో షేకింగ్ మినార్లు
ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం నుండి కరై డ్యామ్ 4.8 కి.మీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ఆటో వరల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం నుండి 7.2 కి.మీ

More News

    Read more about: gujarat ahmedabad
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+