Search
  • Follow NativePlanet
Share
» »పూర్వ సంధ్య టూర్ పేరుతో ఐఆర్‌సీటీసీ స‌రికొత్త టూర్ ప్యాకేజీ..వివ‌రాలివే..?!

పూర్వ సంధ్య టూర్ పేరుతో ఐఆర్‌సీటీసీ స‌రికొత్త టూర్ ప్యాకేజీ..వివ‌రాలివే..?!

ఈ వేస‌విలో కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన వేంకటేశ్వర స్వామిని ద‌ర్శించుకోవాల‌నుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ శుభ‌వార్త‌ను తీసుకొచ్చింది. హైద‌రాబాద్ టు తిరుప‌తి ఓ స‌రికొత్త ప్యాకేజీని భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ మొత్తం నాలుగురోజుల‌పాటు సాగుతుంది. పూర్వ సంధ్య పేరుతో IRCTC టూరిజం అందిస్తోన్నటూర్​ ప్యాకేజీ. వీటి వివ‌రాలను ఓ సారి చూసేద్దాం.

ఏపీలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్య‌క్షేత్రాల‌లో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఒక‌టి. ఇక్క‌డి స్వామి వారి ద‌ర్శ‌న భాగ్యం భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తుంటారు. కుటుంబంతో క‌లిసి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోవాల‌నుకునేవారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ స‌రికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా దర్శన టికెట్ల కోసం ఆలోచించ‌కుండా స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఈ ట్రైన్ టూర్ ప్యాకేజీలో భాగంగా తిరుమలతో పాటు చుట్టు పక్కల ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను కూడా దర్శించుకోవచ్చు. మ‌రెందుకాల‌స్యం మొద‌లెట్టండి మీ తిరుప‌తి ప్ర‌యాణాన్ని..

ఈ ట్రైన్ టూర్ ప్యాకేజీ మే 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.'పూర్వ సంధ్య టూర్ పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది. ఈ టూర్‌లో భాగంగా తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయాలను కూడా వీక్షించొచ్చు.

IRCTC new tour package named Purva Sandhya

నాలుగు రోజుల ప్ర‌యాణ వివరాలు ఇలా ఉన్నాయి...

హైద‌రాబాద్ టు తిరుప‌తి ప్ర‌యాణంలో మొదటి రోజు 12734 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ లింగంపల్లి నుంచి సాయంత్రం 06:25 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్​కు 07:05 గంటలకు చేరుకుంటుంది. నల్గొండ నుంచి 08:35 గంటలకు బయలుదేరుతుంది. రాత్రంతా రైల్లో ప్ర‌యాణం ఉంటుంది. ఇక‌, మ‌రుస‌టి రోజు ఉదయం 06:55 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కి వెళ్లి, ఆ త‌ర్వాత‌ శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల దర్శనం చేసుకుంటారు.

అనంత‌రం శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాల సంద‌ర్శ‌న ఉంటుంది. తర్వాత హోటల్‌కి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రాత్రి తిరుపతిలోనే బస చేయాలి. ఇక‌, మూడో రోజు ఉదయం టిఫిన్ చేసిన త‌ర్వాత 08:30 గంటలకు వేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. అదే రోజు సాయంత్ర 06:20 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. ఆ రాత్రంతా జర్నీ ఉంటుంది.

ఇక‌, నాలుగో రోజు ట్రైన్ తెల్లవారుజామున 03:04 గంటలకు నల్గొండ స్టేషన్​కు చేరుకుంటుంది. అదే ట్రైన్ సికింద్రాబాద్‌కు 05:35 గంటలకు, లింగంపల్లికి ఉదయం 06:55 గంటలకు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి..

హైద‌రాబాద్ టు తిరుప‌తి టూర్ ప్యాకేజీలో భాగంగా స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 7720 చెల్లించాలి. అదే డబుల్ ఆక్యూపెన్సీ అయితే రూ. 5860 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.5,660గా నిర్ణయించారు. కంఫర్ట్ క్లాసులో అయితే, సింగిల్ ఆక్యూపెన్సీ ధర రూ.9570 చెల్లించాలి.

డబుల్ ఆక్యూపెన్సీ రూ. 7720 గా ఉంటుంది. ట్రిపుల్ ఆక్యూపెన్సీ రూ.7510గా నిర్ణయించారు. ఇక‌, ఇందులో 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు వేరువేరు ధరలు అందుబాటులో ఉన్నాయి.
ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్‌ కోసం IRCTC Tourism వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాల్సిందే.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+