Search
  • Follow NativePlanet
Share
» »నేటి నుంచే కేదార్‌నాథ్ ధామ్ యాత్ర ప్రారంభం...ఇలా రిజిస్ట్రేష‌న్ చేసుకోండి..!

నేటి నుంచే కేదార్‌నాథ్ ధామ్ యాత్ర ప్రారంభం...ఇలా రిజిస్ట్రేష‌న్ చేసుకోండి..!

భోలేనాథుని ద‌ర్శించుకోవాల‌నుకునేవారు చాలామంది కేదార్‌నాథ్ దామ్ యాత్ర‌కు బ‌య‌లుదేరుతుంటారు. ఈ కేదార్‌నాథ్ మందిరం ఎన్నో వేల సంవత్సరాల నాటిది. కేదార్ నాథ్ మందిరం ఒక ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉంది. ఇక్క‌డికి వెళ్లాలంటే ఎంతో సాహ‌సంతో కూడుకున్న ప‌ని. కానీ, ఎంతోమంది శివ‌భ‌క్తులు మాత్రం భోలేనాథుని ద‌ర్శ‌నం కోసం వస్తుంటారు. ఈ ఆల‌యాన్ని చేరుకోవాలంటే కఠినమైన పర్వతారోహణ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. గురాలపై, డోలీలో కూడా కొందరు వెళుతుంటారు. ఈ ఆలయంలో భగవంతుడు లింగం రూపంలో పూజలందుకుంటున్నాడు. కేదార్ నాథ్ సంద‌ర్శించుకోవ‌డం అనేది చాలామంది భ‌క్తులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇక్క‌డ సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆది శంకరాచర్య సమాధి, కాళీమఠ్, గౌరి కుండ్ మరియు సోన్ ప్రయాగ్ వంటి ప‌విత్ర ప్ర‌దేశాలు..

ఇంత‌టి ప్ర‌సిద్ధిచెందిన‌ పరమ పవిత్ర పుణ్యక్షేత్రం.. కేదార్ నాథ్ ధామ్ యాత్ర అక్షయ తృతీయ సందర్భంగా, నేటి (మే 10) నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్ర కార్తిక పౌర్ణమి (నవంబర్ 15) వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం ప‌దండి. కేధార్‌నాథ్ ధామ్ యాత్రలో పాల్గొనలాంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేకుండా కేదార్ నాథ్ యాత్రకు వెళ్లేందుకు అవ‌కాశం ఉండ‌దు.

kedarnathdhamyatra

రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి..

కేదార్ నాథ్ ధామ్ కోసం వెళ్లేవారు త‌ప్ప‌కుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది యాత్రకు వెళ్లిన వారి సంఖ్యను ట్రాక్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత‌గానో సహాయపడుతుంది. ఇది ప‌ర్యాట‌కుల మొత్తం సమాచారాన్ని ప్రభుత్వానికి అందించేందుకు ఎంతో సహాయపడుతుంది, కాబట్టి ఈ క‌ఠిన‌త‌ర‌మైన ప్రయాణంలో ప‌ర్యాట‌కులు ఎటువంటి ఇబ్బందులు, స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సంప్రదించేందుకు ఈ రిజిస్ర్టిషన్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

కేదార్ నాథ్ ధామ్ కోసం రిజిస్టర్ చేసుకునే విధానం..

కేదార్ నాథ్ ధామ్ యాత్ర కోసం రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలంటే ముందుగా మీరు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లింక్ registrationandtouristcare.uk.gov.in.ని సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కేదార్ నాథ్ ధామ్ యాత్ర 2024 అని ఉంటుంది. అక్క‌డ ప‌ర్యాట‌కులు వివ‌రాల‌ను నమోదు చేసుకోవచ్చు. కేదార్ నాథ్ ఆలయానికి వెళ్లేందుకు అన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కాలినడకన లేదా విమాన మార్గం ద్వారా, లేదా హెలికాప్టర్ ద్వారానైనా ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు.

kedarnathdhamyatra1

ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్‌..

కేదార్ నాథ్ ధామ్ యాత్ర‌కు వెళ్లాలంటే తప్ప‌కుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప‌ర్యాట‌కులు త‌మ రిజిస్ట్రేషన్ పూర్తి కాకుండా గౌరీకుండ్ దాటి కేదార్ నాథ్ ధామ్ కు చేరుకునే మార్గం లేదు. అయితే, కేధార్ నాథ్ ధామ్ కు వెళ్లే మార్గంలో అనేక రిజిస్ట్రేషన్ పాయింట్లు ఉన్నాయి. యాత్రికులు అక్క‌డ అగి త‌మ రిజిస్టర్ చేసుకోవచ్చు. అదికూడా ఆఫ్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌.

ఒకవేళ పర్యాట‌కులు గ‌నుక సొంత వాహ‌నంలో ప్రయాణిస్తుంటే మాత్రం రిషికేష్ లో ఉన్న రిజిస్ట్రేషన్ పాయింట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజా రవాణాను ఉపయోగించేవారు మాత్రం త‌ప్ప‌కుంఆ గౌరీకుండ్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేష‌న్ స్లిప్ త‌ప్ప‌నిస‌రిగా యాత్రికుల ద‌గ్గ‌ర ఉండాలి. ఈ స్లిప్ ఉంటేనే ట్రెక్కింగ్ కు వెళ్లేందుకు అనుమతి ల‌భిస్తుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+