Search
  • Follow NativePlanet
Share
» »దేశంలోనే అతి పొడవైన సీ బ్రిడ్జి అటల్ సేతు ప్ర‌త్యేక‌త‌లు తెలుసుకుందామా..

దేశంలోనే అతి పొడవైన సీ బ్రిడ్జి అటల్ సేతు ప్ర‌త్యేక‌త‌లు తెలుసుకుందామా..

దేశంనే అతి పొడ‌వైన సీ బ్రిడ్జి అట‌ల్ సేత్‌ను నేడు ప్ర‌ధామ‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్రారంభించ‌నున్నారు. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబయి న‌గ‌రంలో రూపొందిన ఈ వంతెన గురించి తెలుసుకుందాం పదండి..

ఈ వంతెన ద్వారా ముంబ‌యి న‌గ‌ర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ బ్రిడ్జ్ పూర్తి పేరు అటల్ బిహారీ వాజ్‌పేయి శివది న్వశేవ అటల్ సేతు. దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్ స్మారకార్ధం ఈ బ్రిడ్జికి అటల్ సేతు పేరును పెట్ట‌డం జ‌రిగింది. ఈ వంతెన ప్రధానంగా ముంబై నగరంలోని ముంబై నుండి నవీ ముంబై మధ్య ప్రయాణించే సాధారణ ప్రయాణీకుల కష్టాలను తీర్చేందుకు ముందుకొచ్చింది. అటల్ సేతు వంతెన పొడవు 21.8 కిలోమీట‌ర్లు. ఈ బ్రిడ్జిని ఆరు లేన్లతో నిర్మించారు. ఇది సముద్రంలో 16.5 కిలోమీట‌ర్లు, భూమిపై 5.5 కిలోమీట‌ర్ల పొడవు ఉంటుంది. ఇండియాలో సముద్రంపై ఉన్న అత్యంత పొడవైన వంతెన ఇదే కావ‌డం విశేషం.

atalsetu , Mumbai

ముంబై నుండి నవీ ముంబై మధ్య ప్రయాణ సమయం కూడ ఈ వంతెన‌పై ప్ర‌యాణించ‌డం ద్వారా త‌గ్గ‌నుంది. ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉండడంతో ముంబై నుంచి న‌వీ ముంబైకి ప్ర‌యాణించేందుకు రెండు గంటల సమయం పడుతుంది. అదే అటల్ సేతు వంతెన‌పై ప్రయాణం చేస్తే 20 నిమిషాల్లో ప్ర‌యాణం పూర్త‌వుతుంది. ఈ బ్రిడ్జ్‌ఫై 100 కిలోమీట‌ర్ల‌. వేగంతో దూసుకెళ్లొచ్చు. ఎంఎంఆర్‌డీఏ, జేఐసీఏ నిర్వహించిన అధ్యయనం మేరకు ఎంటీహెచ్ఎల్ సెర్వీ, చిర్లే మధ్య ప్రయాణం 61 నిమిషాల నుండి 16 నిమిషాలకు తగ్గనున్న‌ట్లు స‌మాచారం. ప్రతి రోజూ కనీసం ఈ వంతెన‌పై సుమారు 40 వేల వాహనాలు ప్రయాణించనున్నాయని అధికారులు తెలుపుతున్నారు. పుణె, అలిబాగ్, గోవా, పన్వేల్‌ల‌ను క‌లిపేందుకు కూడా ఈ బ్రిడ్జి ఎంత‌గానో దోహదం చేస్తుంది.

ఈ వంతెన నిర్మాణానికి రూ. 21, 200 కోట్లు ఖర్చు చేశారు..

ఈ వంతెన నవీ ముంబైలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై పుణె ఎక్స్‌ప్రెస్ వే, ముంబై గోవా హైవే ల మధ్య కనెక్టివిటిని మెరుగుపర్చేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. 2006లో ఈ వంతెన‌ నిర్మాణానికి టెండర్లు వేయ‌డం జ‌రిగింది. 2008 ఫిబ్రవరిలో అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్ ద్వారా 11 మాసాల్లో 6 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఈ వంతెన నిర్మాణానికి ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు. అయితే కొన్ని మాసాల అనంత‌రం ఈ ప్రాజెక్టు నుండి అంబానీకి చెందిన రిలయన్స్ కంపెనీ త‌ప్పుకోవ‌డం జ‌రిగింది.

అనంత‌రం నోడల్ ఏజెన్సీని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నుండి ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీకి మార్చారు. జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీతో ఎంఎంఆర్‌డీఏ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీంతో ప్రాజెక్టు వ్యయంలో 80 శాతం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 2017 డిసెంబర్‌లో ఈ వంతెన టెండరింగ్ పూర్తైంది. 2018లో ఈ వంతెన పనులు ప్రారంభమయ్యాయి. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 21, 200 కోట్లు ఖర్చు చేశారు.

ఇక, ఈ వంతెన‌పై టూ వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్లకు అనుమతి లేదని అధికారులు వెల్ల‌డించారు. కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులు మాత్ర‌మే ఈ బ్రిడ్జిపై ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌పై నిత్యం రోజూ 70 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్రిడ్జిపై ప్ర‌యాణికుల భ‌ద్ర‌తా దృస్యా 400 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+