Search
  • Follow NativePlanet
Share
» »ప‌ర్యాట‌క శిఖ‌రాగ్రం.. మ‌హాబ‌లేశ్వ‌ర్‌!

ప‌ర్యాట‌క శిఖ‌రాగ్రం.. మ‌హాబ‌లేశ్వ‌ర్‌!

నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే వారు కుటుంబ‌స‌మేతంగా వారాంతపు సెలవుల్లో సేద తీరేందుకు చక్కటి ప్రదేశం మహాబలేశ్వర్. సుందరమైన పశ్చిమ కనుమలలో నెలకొని ఉన్న మహాబలేశ్వర్‌లోని పర్యాటక ప్రదేశాలు వాటి సహజ వైభవంతో సంద‌ర్శ‌కుల మ‌న‌సును కట్టిపడేస్తాయి. అనేక నదులు, అద్భుతమైన జలపాతాలు, గంభీరమైన శిఖరాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో ప్రకృతి ప్రేమికులు కోరుకునే పచ్చటి తోరణాల మాదిరిగా వృక్షాలు, వర్షపు నీటితో ఎటు చూసినా పచ్చగా కనిపించే నేలతో నిండిన మ‌హాబ‌లేశ్వ‌ర్ విశేషాల‌ను తెలుసుకుందాం.

ప‌ర్యాట‌క శిఖ‌రాగ్రం.. మ‌హాబ‌లేశ్వ‌ర్‌!

ప‌ర్యాట‌క శిఖ‌రాగ్రం.. మ‌హాబ‌లేశ్వ‌ర్‌!

మ‌హారాష్ట్ర‌లోని మ‌హాబ‌లేశ్వ‌ర్‌ పురాతన దేవాలయాలు, బోర్డింగ్ పాఠశాలలు, చక్కటి పచ్చటి దట్టమైన అడవి, జలపాతాలు, కొండలు, లోయలతో నిండి ఉంటుంది. ముంబై, పూణే వంటి మెట్రోపాలిటన్ నగరాల నుండి వారాంతపు విహారయాత్రలలో ర‌ద్దీగా క‌నిపిస్తుంది. పూణేకు నైరుతి దిశలో 120 కిలోమీటర్లు, ముంబై నుండి 285 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలేశ్వర్ 150 కిలోమీటర్ల మేర ఉన్న విస్తారమైన పీఠభూమి, అన్ని వైపులా లోయలతో ఆహ్లాద‌కరంగా క‌నిపిస్తుంది. పశ్చిమ కనుమలలోని హిల్ స్టేషన్ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించే కృష్ణా నదికి మూలంగా నిలుస్తోంది. మహాబలేశ్వర్‌లో లెక్క‌లేన‌న్ని ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. నిత్యం స్వ‌చ్ఛ‌మైన నీటితో ప‌ర‌వ‌ళ్లుతొక్కే సెల‌యేళ్లు, సతత హరిత కలప భూములు, ఆకర్షణీయమైన జ‌ల‌పాతాలు, పర్వతాల సరిహద్దులో మహాబలేశ్వర్‌లో మంత్రముగ్దులను చేసే పర్యాటక ప్రదేశాలు అడుగ‌డుగునా ద‌ర్శ‌న‌మిస్తాయి.

ఆకట్టుకునే ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు అనేకం

ఆకట్టుకునే ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు అనేకం

ఈ పాంత్ర‌ సందర్శన తెల్లవారుజామున లేదా సంధ్యా సమయాల మధ్య ప‌చ్చ‌ద‌నం క‌మ్మేసిన ప్ర‌కృతి అందాలు మ‌రో ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేసే అనుభూతిని పొంద‌వ‌చ్చు. పార్శీ పాయింట్‌, ఆర్థ‌ర‌స్ పాయింట్‌, ఎకో పాయింట్‌, సావిత్రి పాయింట్‌, కేట్స్ పాయింట్‌, విల్స‌న్ పాయింట్‌, ఎలిఫెంట్ యెడ్స్ వ్యూ పాయింట్‌, కాస్టిల్ రాక్ పాయింట్‌, మ‌ర‌జోరీ పాయింట్‌, ప్ర‌తాప్ ఘ‌డ్ ఫోర్ట్‌, లింగ‌మాల వాట‌ర్ ఫాల్స్ ఇలా ఆకట్టుకునే ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు అనేకం ఉన్నాయి. ఆక‌ర్షించే స్ట్రాబెర్రీ తోట‌లకు పేరుగాంచిన మహాబలేశ్వర్ జిగ్‌జాగింగ్ రోడ్లు అన్ని సమయాల్లో ప్రశాంతమైన గాలిని ఆస్వాదిస్తూ కొండ‌లు, లోయల అద్భుతమైన వీక్షణలను తిల‌కించ‌వ‌చ్చు. ఇక్క‌డి ప్ర‌ధాన వీధులు పుష్కలంగా స్ట్రాబెర్రీలతోపాటు అన్ని రకాల దుకాణాలతో నిండి ఉంటాయి. ముంబయి, పుణె నగరాలకు దగ్గరగా ఉండే ఈ మహాబలేశ్వర్‌కి సెలవు రోజుల్లో పర్యాట‌కుల‌ తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉండే ఫోర్ట్స్‌కి.. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా ఏటా పెరుగుతూ వ‌స్తోంది.

త దూరం ఉంటుంది..

త దూరం ఉంటుంది..

పుణె నుంచి ఇక్కడికి చేరుకోవడం చాలా సులువు. రోడ్డు మార్గంలో ఇక్కడికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. అదే ముంబయి నుంచి అయితే గనుక.. ఇంకొక మూడు గంటలు అదనంగా వేసుకోవాలి. సమీప రైలు మార్గం 60 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ సతారా. సమీపంలోని ప్రధాన రైల్వే జంక్షన్‌లు పూణే (120 కిలోమీట‌ర్లు), మిరాజ్ (170 కిలోమీట‌ర్లు) దూరంలో ఉన్నాయి. ఈ ప్రదేశాలలో మహాబలేశ్వర్‌కు రాష్ట్ర ప్రభుత్వ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఖేడ్ సమీపంలోని కోకన్ రైల్వేలో ఉన్న రైల్వే స్టేషన్ దివాన్ ఖావతి పొలాద్‌పూర్ మీదుగా మహాబలేశ్వర్‌కు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మహాబలేశ్వర్ నుండి 120 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న పూణే నగరానికి సమీప విమానాశ్రయం పూణే అంతర్జాతీయ విమానాశ్రయం . ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 270 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+