అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఈ పేరు ప్రపంచఖ్యాతి పొందింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. అలా అయోధ్య దర్శనానికి తరలివచ్చేవారు బాలరాముడి దర్శించుకునే ముందు హనుమాన్‌గఢీలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవడానికి మక్కువ చూపుతారు. కానీ, అయోధ్య రామమందిరంలో ఇటీవల భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇక్కడికి వచ్చే భక్తులు హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోలేకపోతున్నారు. దీంతో భారతీయ తపాలశాఖ భక్తలు పడుతోన్న ఇబ్బందులను గుర్తించింది. వారి సమస్యను పరిస్కరించేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరి భారతీయ తపాలశాఖ తీసుకున్న ఆ నిర్ణయమేంటో తెలుసుకుందామా?!
అయోధ్యలో ప్రస్తుతం పెరుగుతున్నభక్తల రద్దీ కారణంగా కొంత మంది భక్తులకు హనుమాన్‌గఢీలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవడం సాధ్యమవ్వడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు తపాలా శాఖ హనుమాన్ గఢీ ఆలయ ప్రసాదాన్ని పోస్టల్ ద్వారా ఇంటికి చేరవేసే వినూత్న కార్యక్రమం చేపట్టింది. హనుమాన్ ప్రసాదం కోసం ఇంట్లోనే ఉండి ఆర్డర్ చేసుకునే అవకాశాన్ని అందించింది. ఇందుకోసం.. తపాలా శాఖ ప్రసాదాన్ని ప్రజలకు చేరవేసేందుకు శ్రీ హనుమాన్‌గఢీ సంకట్మోచన్ సేనా ట్రస్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రసాదం కావాలనుకున్న భక్తులు వారికి దగ్గరలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి ' డిప్యూటీ పోస్ట్‌మాస్టర్ అయోధ్య ధామ్ -224123' పేరు మీద ఈ-మనీ ఆర్డర్ తీయాల్సి ఉంటుంది. ఈ ప్రసాదం అర్డర్లు రూ.251, రూ.551 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. కావాల్సినవారు ఇంటి పూర్తి చిరునామాను ఇచ్చి ఆర్డర్ చేస్తే సరిపోతుంది.

స్పీడ్ పోస్ట్‌లో ఇంటికే ప్రసాదం..
ఆర్డర్ చేసినవారికి 'రూ.251 మనీ అర్డర్‌కు లడ్డూలు, హనుమాన్ చిత్రం, మహావీర్ గంధం, అయోధ్య దర్శన పుస్తకం, అలాగే రూ.551లకు రూ.251కు అందించే వాటితోపాటు తులసీ మాల, హనుమాన్ యంత్రం అందిస్తారు. భక్తులు ఆర్డర్ చేసిన తర్వాత ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికే పంపిస్తామని ప్రయాగ్‌రాజ్, వారణాసి జోన్ పోస్ట్ మాస్టర్ కృష్ణ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఆర్డర్ స్పీడ్ పోస్ట్ వివరాలు భక్తులు ఎప్పటికప్పుడు తమ మొబైల్‌కు వచ్చే ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈ-మనీ ఆర్డర్లో భక్తుల పూర్తి చిరునామా, పిన్‌కోడ్ ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.
తపాలాశాఖ నిర్ణయం పట్ల భక్తలు హర్షం
ఇదిలా ఉంటే.. భారత తపాలా శాఖ సహకారంతో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ఆహ్వాన పత్రికలను పంపిణీ చేయడంలో ఎంతగానో సహకరించిన విషయం తెలిసిందే. అంతకు మందు భక్తులకు గంగాజలాన్ని, రక్షణ బంధన్ పండుగ కోసం సోదరులకు రాఖీలను చేరవేయడం వంటి కార్యక్రమాలను చేపట్టి.. పూర్తిస్థాయిలో సెక్సస్ అయ్యింది. ఇప్పుడు తాజాగా భక్తల ఇబ్బందులు గుర్తించి భారత తపాలా శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల భక్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తపాలశాఖ చేపడుతున్న పలు కార్యక్రమాలు ప్రజలకు చేరువ అవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. మరెందుకు ఆలస్యం మీరూ హనుమాన్ ప్రసాదాన్ని స్వీకరించాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేయండి.



Click it and Unblock the Notifications













