Search
  • Follow NativePlanet
Share
» »రాతివ‌నంలో నంద‌మూరి హీరో బాల‌కృష్ణ సినిమా షూటింగ్

రాతివ‌నంలో నంద‌మూరి హీరో బాల‌కృష్ణ సినిమా షూటింగ్

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు సమీపంలో ఉన్న‌ రాతివ‌నం పేరు మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. అందుకు కార‌ణం నంద‌మూరి హీరో బాల‌కృష్ణ ఓ సినిమా షూటింగ్ కోసం ఇక్క‌డ సంద‌డి చేయ‌డ‌మే. నిజానికి, రాతివ‌నం ప్రాంతం సహజ సౌందర్యంతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ సహజసిద్ధమైన ఏర్పడిన రాళ్లు వివిధ ఆకృతులతో చూప‌రుల‌ను ఎంతో ఆక‌ర్షిస్తాయి. మ‌రీ ముఖ్యంగా వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. ఇక్క‌డి పచ్చని చెట్ల మధ్య క‌నువిందు చేసే రాళ్లు అనుభ‌విజ్ఞుడైన శిల్పి చేత చెక్క‌బ‌డ్డాయా? అని ఆశ్చ‌ర్యం క‌లిగించేవిలా ద‌ర్శ‌న‌మిస్తాయి. ఈ స‌హ‌జ‌సిద్ధ అందాలే పర్యాట‌కులు ఇక్క‌డ వాలిపోయేలా చేస్తున్నాయి. ప‌లు ర‌కాల ఫోటో షూట్‌తోపాటు సీరియ‌ళ్లు, సినిమాల షూటింగ్‌లతో ఈ ప్రాంతం సంద‌డిగా క‌నిపిస్తుంది.

ఇటీవ‌ల ఈ ఓర్వకల్లు సమీపంలోని రాతివనంలో తెలుగు సినీ హీరో బాలకృష్ణ సినిమా షూటింగ్‌ నిర్వహించ‌డంతో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. మొత్త‌తం రెండు రోజులపాటు పలు సన్నివేశాలు ఇక్క‌డ చిత్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. సితారా ఎంటర్‌ప్రైజెస్‌ ప్రొడక్షన్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా, బాబీ దర్శకత్వంలో ప్రత్యజ్ఞజ్వాలా హీరోయిన్‌గా ఎన్‌బీకే 109 ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌తో భాగంగా ఒక‌ పాటతోపాటు కొన్ని విలన్ స‌న్నివేశాల‌ను ఇక్క‌డ షూట్ చేశారు.

orvakallu ghost town

సినిమాలో బాలకృష్ణ తన అనుచరులకు గన్‌ ఫైరింగ్‌ నేర్పించే సీన్‌తోపాటు ఫైట్ సీన్ ఇక్క‌డ చిత్రీకరించారు. నిశ‌బ్ధ‌మైన వాతావ‌ణంలో ముచ్చ‌ట‌గొలిపే ఇక్క‌డి లోకేష‌న్స్ స్క్రీన్‌కు స‌రికొత్త అందాన్ని ఇస్తాయి. రాతివ‌నాల్లో బాలకృష్ణ సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలుసుకున్న బాల‌య్య అభిమానులు పెద్ద ఎత్తున ఇక్క‌డ‌కు చేరుకుని సంద‌డి చేశారు. ఇలాంటి స‌మ‌యాల్లో స్థానిక పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భద్ర‌తా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.

orvakallu

స‌హ‌జ‌సిద్ధ‌మైన రాతి అందాలు..

కోట్ల‌ సంవ‌త్స‌రాల క్రితం అగ్ని పర్వతాలు బద్దలవటంతో ఏర్పడ్డ అతి సహజసిద్దమైన ప్రకృతి అందాలే ఈ రాతివనాలుగా చెబుతారు. అంతేకాదు, ఈ రాక్‌ గార్డెన్స్‌ ఆసియా ఖండంలోనే అతి పెద్దవని, కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడినవని చరిత్రకారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న‌ రాక్‌ గార్డెన్స్ సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. క‌నుచూపుమేర ఎటు చూసినా రాతి నిర్మాణళ్లా క‌నువిందూ చేస్తూ.. ఓ రాతి ప్ర‌పంచంలో ఉన్న అనుభూతిని క‌లిగిస్తాయి. ఈ రాళ్లలో క్వార్జ్‌, సిలికా, గాజు ఇతర ముడి పదార్థాలు ఉన్నట్లు క‌నుగొన్నారు.

kurnool1

ఇంకాస్త దృష్టి సారిస్తే..

ఇటీవ‌ల షూటింగ్‌లు జ‌రుగుతుండ‌డంతో ప్రస్తుతం పర్యాటకుల తాకిడి పెరుగుతూ వ‌స్తోంది. అయితే, ఇక్కడికి వచ్చే సందర్శకుల కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక గదులు, విశాలమైన రహదారులు, పిల్లల కోసం క్రీడా పరికరాలు ఏర్పాటు చేసింది. కొండల మధ్య ఉన్న‌ చెరువుపై వంతెన నిర్మించింది. పనికిరాని ఇనుప వస్తువులతో తయారు చేసిన జంతువులు, పక్షుల ప్రతిమలు ఏర్పాటు చేసింది. వీటి నిర్వ‌హ‌న స‌రిగా లేక‌పోవ‌డంతో ఇటీవ‌ల ప‌ర్యాట‌కుల తాకిడి త‌గ్గుతూ వ‌చ్చింది. అధికారులు ఇక్క‌డి ఏర్పాట్లుపై కాస్త దృష్టిసారిస్తే రాతివ‌నం మ‌రింత ప‌ర్యాట‌క అభివృద్ధి చెందుతుంద‌ని ప‌ర్యాట‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+