రాజస్థాన్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబంబించే సంభార్ ఫెస్టివల్!
సంభార్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం, ఈ ఫెస్టివల్‌ను ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 19 వరకు జరిపేందుకు సన్నాహాలు చేశారు. రాజస్థాన్‌లోని అందమైన నగరం జైపూర్‌లో మూడు రోజుల సంభార్ ఉత్సవం జరగనుంది. సంభార్ ఫెస్టివల్ 2023 రాజస్థాన్ నాగరికత, సంస్కృతి, దుస్తులు మరియు రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి చెందేలా రూపొందించారు. ఆ విశేషాలు తెలుసుకుందాం రండి!
ప్రతి సంవత్సరం మన దేశంలోపాటు విదేశాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు రాజస్థాన్ సందర్శించడానికి వస్తుంటారు. అలాంటి సందర్శకుల కోసం రాజస్థాన్‌లో అనేక ప్రధాన పర్యాటక ప్రదేశాలు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ లాంటి పర్యాటక ప్రాంతాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
ఈ క్రమంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి రాజస్థాన్‌లో ప్రతి సంవత్సరం అనేక పండుగలు జరుపుతూ ఉంటారు. అందులో ఒకటి ఈ సంభార్ పండుగ. ఈ పండుగను ఫిబ్రవరి నెలలో జరుపడం ఆనవాయితీగా వస్తోంది. వేలాదిగా తరలి వచ్చే సందర్శకుల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేశారు నిర్వాహకులు.

బైక్ రైడ్ అద్భుత విన్యాసాలు..
రాజస్థాన్ నాగరికత మరియు సంస్కృతి గురించి తెలుసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా సంభార్ ఫెస్టివల్ చూడటానికి వెళ్లండి. సంబార్ పండుగ మొదటి రోజు బైక్ రైడ్ నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ఔత్సాహిక బైక్ రైడర్లు సుదూర ప్రాంతాలనుంచి ఇక్కడ వాలిపోతారు. వారు చేసే అద్భుత విన్యాసాలను మనసారా ఆస్వాదించవచ్చు. రయ్ మంటూ దూసుకుపోయే అధునాతన మోడల్ బైక్‌లను ఈ రైడ్‌ల సందర్భంగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే, రాత్రిపూట ఇక్కడి గులాబీ నగరం నుండి ఆరుబయట ఆకాశంలో నైట్ స్టాండ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ మూడు రోజులూ ఇక్కడ కనిపించే సందడి మాటల్లో వర్ణించడం కష్టమే.

కళాకారులు రాజస్థానీ దుస్తులు..
ముఖ్యంగా ఇక్కడ సాయంత్రం జరిగే దీపోత్సవం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మిరుమెట్లుగొలిపే దీపపు అందాలను మాటల్లో వర్ణించడం కాస్త కష్టమే. అనంతరం జానపద కళాకారులు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను చూడవచ్చు. ఈ సందర్భంగా కళాకారులు రాజస్థానీ దుస్తుల్లో కనువిందు చేస్తారు. చారిత్రక వేషాధారణలో సందడి చేసే నృత్యాలు జీవితంలో మర్చిపోలేని అనుభూతులను చేరువ చేస్తాయి. ఈ ఏడాది సంభార్ పండుగలో టాక్ షో కూడా నిర్వహిస్తున్నారు. ఇదే సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలవబోతుందని నిర్వాహకులు చెబుతున్నారు. అదే సమయంలో సంభార్ ఉత్సవాల చివరి రోజు విజేతలను సన్మానించడం ఆనవాయితీగా వస్తోంది.

స్థానిక రుచులను ఆస్వాదించండి..
స్థానిక రుచులను ఆస్వాదించండం అస్సులు మిస్సవ్వొద్దు. మీరు సంభార్ పండుగను సందర్శిస్తే, స్థానిక రుచికరమైన చుర్మాలడూ, మావా కచోరీ, ఘేవర్, బలుషాహి, దాల్ బాటి, రాజస్థానీ కధి, కైర్ సంగ్రి వంటి అనేక వంటకాలు మీ నోరూరిస్తాయి. ఇది కాకుండా, పర్యాటకులు పండుగలో గాలిపటాలు ఎగరవేయడం, పక్షులను చూడటం, రాత్రి నక్షత్రాలను అందాలను వీక్షించడం, సరస్సు సందర్శన మొదలైన అనుభవాలను మూటగట్టుకోవచ్చు. మరెందుకు ఆలస్యం సంభార్ ఫెస్టివల్‌ను ఎంజాయ్ చేసేందుకు కుటుంబ సమేతంగా మీరూ రాజస్థాన్ బయలుదేరండి!



Click it and Unblock the Notifications













