Search
  • Follow NativePlanet
Share
» »Taj Mahotsav 2024: నేటి నుండి ప్రారంభం కానున్న తాజ్ మహోత్సవ్...

Taj Mahotsav 2024: నేటి నుండి ప్రారంభం కానున్న తాజ్ మహోత్సవ్...

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి క‌ట్ట‌డంగా పేరుగాంచిన తాజ్‌మ‌హ‌ల్‌ని చూడాల‌ని ప్ర‌తిఒక్క‌రూ అనుకుంటూ ఉంటారు. ఈ క‌ట్ట‌డం ఆగ్రాలో ఉంది. ఈ క‌ట్ట‌డాన్ని వీక్షించేందుకు చాలామంది దేశ విదేశాల నుంచి ప‌ర్యాట‌కులు త‌ర‌లివ‌స్తుంటారు. తాజ్ మహల్, ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో కూడా చేర్చబడింది. ఇది ప్రేమకు ప్రత్యేకమైన చిహ్నంగా భావిస్తారు. ఎవ‌రైనా ఆగ్రా ప్ర‌యాణానికి సిద్ధ‌మ‌వుతుంటే మాత్రం ఇక్క‌డ ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌రిగే తాజ్ మహోత్సవ్ (Taj Mahotsav 2024)ను త‌ప్ప‌క సంద‌ర్శించండి.

తాజ్ మహోత్సవ్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆగ్రాలో నిర్వహించబడుతుంది. ఈ ఉత్స‌వంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు త‌ర‌లి వ‌స్తుంటారు. ఈ ఏడాది ఉత్స‌వం ఫిబ్రవరి 17న ప్రారంభమై ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. పర్యాటకుల కోసం ఈసారి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వీక్ష‌ణ‌తోపాటు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌కు కూడా పూర్తి ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింది.

tajmahotsav , agra

తాజ్ మహోత్సవం ఎప్పుడు?

ఈ సంవత్సరం తాజ్ మహోత్సవం ఫిబ్రవరి 17 నుండి ప్రారంభ‌మవుతుంది. తాజ్ మహోత్సవ్ అనేది 10 రోజుల పాటు జరిగే వార్షిక కార్యక్రమం, ఇది ఫిబ్రవరి 27న ముగుస్తుంది.

ఈసారి జ‌ర‌గ‌బోయే తాజ్ మహోత్సవం ప్రత్యేకం...

ఈ ఏడాది తాజ్ మహోత్సవ్‌లో ఎన్నో కొత్త విషయాలు కనిపిస్తాయి. ఈసారి యమునా మహా ఆరతి తాజ్ మహోత్సవ్‌కు జోడించబడింది. యమునా నది ఘాట్‌లపై తాజ్ మహోత్సవం సందర్భంగా మహా ఆరతి కార్య‌క్ర‌మం నిర్వహిస్తారు. దీంతో పాటు పర్యాటకుల కోసం గాలిపటాల పండుగ, గజల్ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఈసారి పర్యాటకులు తాజ్ మహోత్సవ్‌కు రావడం ద్వారా హాట్ ఎయిర్ బెలూన్‌ను కూడా ఆస్వాదించవచ్చు.

వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు..

తాజ్ మహోత్సవ్ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను చూడటం ఒక విభిన్నమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం ప్రసిద్ధ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తారు. తాజ్ కమిటీ, ఉత్తర్ ప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా ఈ ఉత్స‌వాన్ని నిర్వహిస్తాయి. తాజ్ మహల్ తూర్పు ద్వారం సమీపంలోని శిల్పగ్రామ్లో ఈ వేడుకలు నిర్వ‌హించ‌నున్నారు.

tajmahotsav starts today

తాజ్ మహోత్సవ్‌లో భారతీయ సంగీతం, నృత్యానికి సంబంధించిన వివిధ రకాలను చూసే అవకాశం లభిస్తుంది. ఇక్కడకు వచ్చి కథక్, భరతనాట్యం, క్లాసికల్ మరియు సబ్-క్లాసికల్ గానం, భోజ్‌పురి గానం, అవధి గానం, ఖవ్వాలి, భజన్ సంధ్య, బ్రజ్ జానపద పాటలు, జానపద నృత్యాలు, వేణువు వాయించడం, సరోద్ వాయించడం, సితార్ వాయించడం, తబలా వాయించడం, పఖావాజ్ వాయించడం వంటివ‌న్నీ ఆనందించవచ్చు. రుద్రవీణ మొదలైనవి.

తాజ్ మహోత్సవ్‌లో ప్రముఖ బాలీవుడ్ కళాకారులు కూడా ప్రదర్శన ఇస్తారు. ఇందులో గజల్ సింగర్, ఖవ్వాలి, సింగర్, స్టాండప్ కామెడీ, ఇతర ఈవెంట్‌లను కూడా నిర్వ‌హిస్తారు. ఇవీ కాకుండా ఇంకా దేశం నలుమూలల నుండి వచ్చే వందలాది మంది కళాకారులు తమ అద్భుతమైన శిల్ప కళా, హస్త కళా నైపుణ్యాలను ప్రదర్శ‌న‌లో ఉంచుతారు. ఇక్కడ చాలావరకు ప్రాంతీయ ప్రత్యేకతలు క‌లిగిన అన్నీ క‌ళాఖండాలు అన్నీ ఒకేచోట దొరికే వీలుంటుంది.

ఇందులో ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చే కళాకారులు వెదురు బొంగుతో తయారు చేసిన బొమ్మలు ప్రదర్శనలో ఉంచుతారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల నుండి వచ్చేవారు రాతి శిల్పాలు, అలాగే జమ్మూ కశ్మీర్ నుండి వచ్చేవారు తివాచీలు, షాలువాలు, స్వెటర్ల వంటివి ప్రదర్శనకు ఉంచుతారు. ఇక్కడ హస్తకళా కళల ప్రదర్శన, దుకాణాలు, రుచికరమైన ఆహారం కోసం ఫుడ్ జోన్ మొదలైనవాటిని ప‌ర్యాట‌కులు ఎంత‌గానో ఆస్వాదించవచ్చు.తాజ్ మహోత్సవ్ ప్రవేశ టికెట్ రూ. 50. విదేశీ పర్యాటకులు మరియు ఐదేళ్లలోపు పిల్లలకు ప్రవేశ రుసుము లేదు.

More News

    Read more about: agra tour taj mahal visit
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+