Search
  • Follow NativePlanet
Share

ఆగ్రా - అందమైన తాజ్ అందరిది  !

81

అత్యద్భుతమైన తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నది. ఇది ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో, ఢిల్లీ నుండి 200 కి. మీ. దూరంలో ఉన్నది. ఆగ్రాలో అత్యద్భుతమైన తాజ్ మహల్ కాకుండా, ఆగ్రా కోట మరియు ఫతేపూర్ సిక్రీ అనే రెండు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఆగ్రా చరిత్ర దాదాపు 11 వ శతాబ్దంలో ప్రారంభమయింది. దాని చరిత్ర కాలంలో, ఆగ్రా, హిందూ మరియు ముస్లిం మత పాలకుల మధ్య చేతులు మారింది మరియు అందువలన రెండు సంస్కృతుల ముద్రలు దుస్తుల నేత నేసినట్లుగా ఉంటాయి.

చరిత్ర

1526 నుండి 1658 వరకు మొఘల్ సామ్రాజ్య రాజధానిగా ఉన్న ఆగ్రా, మొగలులు కాలంలో బాగా వెలుగులోకి వొచ్చింది. మొఘల్ చక్రవర్తి బాబర్ 1526 లో ఆగ్రా తన రాజధానిగా చేశాడు. మొఘల్ పాలకులు ప్రఖ్యాత భవన నిర్మాణకులు మరియు నగరంలో అసంఖ్యాక కళాఖండాలు నిర్మించారు మరియు ఈ శకంలో ప్రతి పాలకుడు బ్రహ్మాండమైన ఆడంబరంతో కూడిన స్మారక కట్టడాల నిర్మాణం ద్వారా తన ముందువారిని అధిగమించాలని ప్రయత్నించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన మొట్టమొదటి అంతంలేనటువంటి ప్రేమకు గుర్తుగా కట్టిన సమాధి తాజ్ మహల్. దీనిని చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ మీద ఉన్న ప్రేమకు గుర్తుగా నిర్మించాడు. చక్రవర్తి అక్బర్ కూడా ఆగ్రా కోటను పునరుద్ధరించాడు మరియు నగరం యొక్క పొలిమేరలో ఫతేపూర్ సిక్రీ నిర్మించాడు.

ఆగ్రాలో పర్యటన ఆగ్రా, జైపూర్, ఢిల్లీ కలిగిన బంగారు త్రికోణంలో ఆగ్రా ఒక భాగం. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఆగ్రాను సాధారణంగా ఒక్క రోజులో పర్యాటకులు సందర్శిస్తారు. అయితే, తాజ్ మహల్ మించి వెళ్ళాలి అనుకునే వారికి నిద్ర మరియు తినడానికి స్థలాలు పుష్కలంగా ఉన్నాయి. ఫతేపూర్ సిక్రీ మరియు మథుర వంటి దగ్గరలో ఉన్న ప్రదేశాల ప్రయాణాల ప్రతిపాదనలు కూడా చేయవొచ్చు. నగరంలో మీరు అందమైన మరియు స్థానిక చేతిపనుల కోసం షాపింగ్ చేయాలనుకుంటే, ఇక్కడ కలగూర గంపలా గజిబిజిగా వుండే మార్కెట్ ఉన్నది. ఒక వైపు రిక్షావాలాలను మరియు అనధికారిక మార్గదర్శకులను బయట ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి.

ఆగ్రా లో మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు

ఆగ్రాలో ఉన్న చారిత్రక కట్టడాలు మరియు భవనాలు నిస్సందేహంగా దాని ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. తాజ్ మహల్ కాకుండా, మీరు యమునా నది ఒడ్డున ఉన్న ఆగ్రా కోటను మరియు అక్బర్ ది గ్రేట్ సమాధి కూడా సందర్శించవొచ్చు. చిని కా రౌజా, దివాన్-ఇ-అం, మరియు దివాన్-ఇ-ఖాస్ వంటి స్మారక చిహ్నాలు మొఘల్ పాలనలో జీవితం ప్రావీణ్యతను చాటి చెప్పుతున్నాయి. ఇత్మద్-ఉద్-దౌలా సమాధి, మరియం జామని సమాధి, జస్వంత్ కి చ్చత్రి, చౌసత్ ఖంబ, మరియు తాజ్ మ్యూజియం వంటి ఆసక్తిని కలిగించే ఇతర ప్రాంతాలు కూడా ఉన్నాయి.

భారతదేశం లోని ఇతర నగరాల్లో మాదిరిగా, ఆగ్రాలో కూడా మత సహనం ప్రతిబింబిస్తుంది మరియు ఇక్కడ జమ మస్జిద్, ప్రసిద్ధ హిందూ మతం దేవాలయమైన బాగేశ్వర్ నాథ్ దేవాలయం ఉన్నాయి. దేశంలోని ఇతర నగరాల వలె ఆగ్రా ప్రాంతం కూడా రకరకాల ధ్వనులు, చూడవలసిన స్థలాలతో గజిబుజిగా ఉంటుంది మరియు ఇక్కడ సందర్శించే ప్రతి ప్రదేశం కూడా మీరు పూర్తిగా అనుభూతి చెందుతారు. అయినప్పటికీ, మీరు సొయామి బాగ్ మరియు మెహతాబ్ బాగ్ బొటానికల్ గార్డెన్స్ వంటి ప్రశాంతమైన ప్రాంతాల నుండి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం వీక్షించవొచ్చు మరియు తాజ్ మహల్ ఈ జన సమూహాల నుండి దూరంగా ఉన్నది.

సందర్శకులను కేవలం ఆగ్రా మాత్రమే ఆకర్షించటంలేదు. ఇక్కడ కొంగలు, సైబీరియన్ క్రేన్, సారస్ క్రేన్, బ్రాహ్మినీ బాతులు, బార్ తల ఉండే బాతు మరియు గద్వాల్ల్స్ మరియు షోవెల్లర్లు వంటి వలస పక్షులతో కీథం సరస్సు మరియు సుర్ సరోవర్ బర్డ్ అభయారణ్యం వద్ద సందర్శకులను స్వాగతిస్తున్నాయి.

ఆగ్రా చేరుకోవటం ఆగ్రా చేరుకోవటానికి విమాన, రైలు మరియు రోడ్డు మార్గాల సౌకర్యం ఉన్నది.

ఆగ్రా లో వాతావరణంఆగ్రా అత్యంత వేడిగా మరియు చల్లగా ఉన్న ఉప ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది.

ఆగ్రాను సందర్శించటానికి అక్టోబర్ నుండి మార్చ్ నెలల వరకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మరియు మధ్యస్తంగా ఉంటుంది మరియు ఈ సమయంలో ఇక్కడ అనేక సాంస్కృతిక పండుగలు జరుగుతాయి. అయితే, వేసవి నెలల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉండి, భరించలేనంత వేడి ఉంటుంది. అయినప్పటికీ, తాజ్ యొక్క అందం ముందు ఈ వేడి, దుమ్ము ఏవి లెక్కలోకి రావు.

ఆగ్రా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఆగ్రా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఆగ్రా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఆగ్రా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ మార్గం ద్వారా: ఆగ్రా, NH2, NH3, మరియు NH11 మూడు ప్రధాన జాతీయ రహదారుల ద్వారా దేశంలోని మిగతా ప్రాంతాలకు అనుసంధించబడింది. ప్రభుత్వం బస్సులు, ప్రైవేట్ బస్సులు మరియు వోల్వో వంటి లగ్జరీ బస్సులు మరియు ఆగ్రా రాకపోకలకు అందుబాటులో ఉన్నాయి. UPటూరిజం డీలక్స్ బస్సులలో సికంద్రా మరియు ఫతేపూర్ సిక్రీ వంటి నగరం లోపల స్థలాలను సందర్శించటానికి మార్గదర్శక పర్యటనలను నిర్వహిస్తున్నది. ఇటీవల ప్రారంభించిన నోయిడా ఎక్స్ప్రెస్ వే ద్వారా ఆగ్రాతో అనుసంధానం పెరిగింది మరియు ప్రయాణ సమయం తగ్గింది. ఇప్పుడు, ఢిల్లీ నుండి ఆగ్రా చేరుకోవటానికి రెండు గంటల కన్నా తక్కువ సమయం పడుతున్నది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం ద్వారా: ఆగ్రా, భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధి చెందిన దర్శనీయ ప్రదేశాలలో ఒకటి మరియు ఇది రైలు మార్గం ద్వారా అనుసంధించబడి ఉన్నది. ఈ నగరం ఏడు రైల్వే స్టేషన్లు, తుండ్ల జంక్షన్ కాకుండా కలిగి ఉన్నది. ఇక్కడ నుండి తుండ్ల జంక్షన్ కి ఒక గంట ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ ఏడింటిలో, మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు ఆగ్రా కోట రైల్వే స్టేషన్, ఆగ్రా CANTT రైల్వే స్టేషన్ మరియు రాజా-కి-మండి ఉన్నాయి. చాలా రైళ్లు మీరు విలాసవంతంగా జీవించడానికి అనువుగా ఉండే లగ్జరీ రైలు 'పాలెస్ ఆన్ వీల్స్', శతాబ్ది మరియు రాజధాని ఎక్స్ప్రెస్ సహా, మునుపటి రెండు స్టేషన్లు గుండా వెళ్ళుతున్నాయి. తుండ్ల స్టేషన్ నుండి రోడ్ మార్గం ద్వారా ఆగ్రాకు అనుసంధించబడింది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఆగ్రా చేరుకోవడం ఎలా? ఆగ్రా, దాని స్వంత విమానాశ్రయం, ఖేరియా విమానాశ్రయం నగరం నడిబొడ్డు నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా పెద్ద దేశీయ విమానయాన సంస్థల ద్వారా సేవలు అందిస్తున్నది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat