Search
  • Follow NativePlanet
Share
» » ఆ బొటానికల్ గార్డెన్.. ల‌క్నో న‌గ‌రానికి ఊపిరితిత్తులు

ఆ బొటానికల్ గార్డెన్.. ల‌క్నో న‌గ‌రానికి ఊపిరితిత్తులు

ఆ బొటానికల్ గార్డెన్.. ల‌క్నో న‌గ‌రానికి ఊపిరితిత్తులు

భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ పొందిన బొటానికల్ గార్డెన్‌లలో ఒకటి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఇది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో న‌గ‌రంలో 25 హెక్టార్ల విస్తీర్ణంలో విస్త‌రించి ఉంది. న‌గ‌రానికి 113 మీట‌ర్ల ఎత్తులో, గోమతి నదికి దక్షిణం వైపున ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని అందిస్తోన్న ఈ గార్డెన్‌కు ఎంతో చారిత్ర‌క నేప‌థ్యం ఉంది.

లక్నో బొటానికల్ గార్డెన్ చరిత్ర

లక్నో బొటానికల్ గార్డెన్ చరిత్ర

క్రీస్తు శ‌కం 1800లో లక్నోలోని నవాబులు చేత రాయల్ గార్డెన్‌గా రూపొందించబడిన సికందర్ బాగ్ ప్రస్తుతం లక్నో బొటానికల్ గార్డెన్‌గా పిలువబడుతోంది. గార్డెన్‌లో క‌నువిందుచేసే అనేక రకాల వైవిధ్యమైన మొక్కలకు నిలయంగా పేరుగాంచింది. అంతేకాదు, కాలుష్యంతో నిండిన న‌గ‌రానికి ఈ గార్డెన్‌ ఊపిరితిత్తులలా పనిచేస్తుంది. దేశ‌, విదేశాల నుండి వ‌చ్చే పరిశోధకులు, విద్యార్థులు, బోధకులు, నర్సరీ కార్మికులతోపాటు ఉద్యానవనాల‌ను ఆస్వాదించే ప్ర‌కృతి ప్రేమికుల‌కు ఇది ఒక స్వ‌ర్గ‌ధామంగా చెప్పొచ్చు. దేశంలోని అంత‌రిపోతోన్న అనేక ర‌కాల‌ వృక్షజాలాన్ని పరిరక్షించడానికి గార్డెన్ కేంద్ర బిందువుగా నిలుస్తోంది. లక్నోలోని బొటానికల్ గార్డెన్‌ని సందర్శించడానికి ఎటువంటి ప్రవేశ రుసుము అవసరం లేదు.

ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌గా నిలిచే గార్డెన్‌..

ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌గా నిలిచే గార్డెన్‌..

నగరంలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. పబ్లిక్ గార్డెన్ చుట్టూ పచ్చని మొక్కలు, పొదలతో ప‌చ్చ‌ని అడ‌విని చేరువ చేస్తుంది. న‌గ‌ర‌వాసులు రాత్రిపూట షికారు చేయడానికి ఇది సరైన ప్రదేశం. అంతేకాదు, కుటుంబ‌స‌భ్యులు, స్నేహిత‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపేందుకు ఓ మంచి పిక్నిక్ స్పాట్‌గా కూడా చెప్పొచ్చు. ఇక్క‌డికి సమీపంలో అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు సంద‌ర్శ‌కుల‌ను క‌నువిందు చేస్తాయి. ముఖ్యంగా, సెయింట్ జోసెఫ్ కేథడ్రల్‌, కైసర్‌బాగ్ ప్యాలెస్, ఔరంగజేబు మసీదు, దిల్‌కుషా కోఠి,

జైన దేవాలయం, బుద్ధ దేవాలయం వంటి ఎన్నో చారిత్ర‌క నిర్మాణాలు చూప‌రుల‌ను క‌ట్టిప‌డేస్తాయి. శీతాకాలం అంతా చల్లగా, ప్రశాంతంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సీజ‌న్ ప్రయాణానికి మరియు ప్ర‌కృతి అందాల‌ అన్వేషణకు అనువైనదిగా చెప్పొచ్చు. శీతాకాలపు ఉష్ణోగ్రత 7 నుండి 24 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కాబట్టి, లక్నో సందర్శించడానికి సరైన సీజన్ శీతాకాలం. ఈ కాలంలో లక్నోలోని ఇతర పర్యాటక ప్రదేశాలను కూడా అన్వేషించవచ్చు.

బొటానికల్ గార్డెన్ చేరుకోవడం ఎలా?

బొటానికల్ గార్డెన్ చేరుకోవడం ఎలా?

భారతదేశంలోని అన్ని పట్టణ కేంద్రాలతో పాటు సమీప ప్రాంతాలకు మంచి రోడ్డు కనెక్షన్లు ఉన్నాయి. కాన్పూర్ లేదా ఝాన్సీ నుండి లక్నో వెళ్లాలంటే జాతీయ రహదారి 27ను తప్పనిసరిగా ఉపయోగించాలి. వారణాసి మరియు ఆగ్రాలు వరుసగా జాతీయ రహదారి 30 మరియు ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్ వే ద్వారా లక్నోకు అనుసంధానించబడి ఉన్నాయి.

నగరంలోకి ప్ర‌వేశించిన‌ సందర్శకుల కోసం అద్భుతమైన ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. రైలు మార్గంలో అయితే, లక్నో జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్క‌డికి దాదాపు 4.4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నగరం యొక్క సెంట్రల్ రైల్వే స్టేషన్. రైలు నుండి, మీరు బొటానికల్ గార్డెన్‌కి వెళ్లడానికి టాక్సీ లేదా ప్రైవేట్ కారులో ప్రయాణించవచ్చు. ఈ జ‌ర్నీ దాదాపు 21 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+