భారతదేశంలోని ప్రసిద్ధ కోటలు ఇవే...
భారతదేశం దాని సాంస్కృతిక, సామాజిక మరియు చారిత్రక వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు. చారిత్రాత్మకంగా దేశంలో అనేక కోటలు ఉన్నాయి. ప్రతి కోటకు దాని సొంత ప్రాముఖ్యత ఉంది. వాటి చరిత్ర కూడా చాలా గొప్పది. ఇక్కడి కళలు, సంస్కృతి విదేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. చారిత్రాత్మకంగా దేశంలో అనేక కోటలు ఉన్నాయి. వాటి వైభవం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాబట్టి భారతదేశంలోని ప్రసిద్ధ కోటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

జైసల్మేర్ కోట
జైసల్మేర్ కోట రాజస్థాన్‌లో ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. దీనిని రావల్ జైస్వాల్ నిర్మించారు. జైసల్మేర్ కోటను సోనార్ బనానా అని కూడా అంటారు. ఈ కోటను భారతదేశపు పాత కోటగా పిలుస్తారు. ఈ కోటలో అత్యంత ఆకర్షణీయంగా జైన దేవాలయాలు, రాజ భవనం, పెద్ద ద్వారాలు ఉన్నాయి. జైసల్మేర్ ఎడారి నగరం, పాత హవేలీలు సరస్సులకు ప్రసిద్ధి.

ఆగ్రా కోట, ఉత్తరప్రదేశ్
ఆగ్రా పర్యాటక పరంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఏడాది పొడవునా భారతదేశం, విదేశాల నుండి పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. యునెస్కో ఈ కోటను ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చింది. మొఘల్ పాలకుడు అక్బర్ చక్రవర్తి 1573లో ఆగ్రా కోట నిర్మాణాన్ని ప్రారంభించాడు. మొఘల్ చక్రవర్తులు బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ మరియు ఔరంగజేబ్ ఇక్కడే ఉండేవారు.

రెడ్ ఫోర్ట్, ఢిల్లీ
ఎర్రకోట భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన మరియు ప్రసిద్ధ కోటలలో ఒకటి. ఈ కోట ఢిల్లీలో ఉంది. ఈ కోటను మొఘల్ పాలకుడు షాజహాన్ నిర్మించాడు. ఈ కోట గోడలు ఎర్ర రాతితో ఉంటాయి. అందుకే దీన్ని ఎర్రకోట ఢిల్లీ అని పిలుస్తారు. ఈ కోట లోపల చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇది భారతదేశపు అత్యంత ముఖ్యమైన వారసత్వాలలో ఒకటి.
గ్వాలియర్ కోట, మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లో ఉన్న గ్వాలియర్ కోట అందం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ కోటను రాజా మాన్‌సింగ్ తోమర్ నిర్మించారు. 100 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోట ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడింది. ఇది మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది ఢిల్లీకి దక్షిణంగా 343 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆగ్రా నుండి 120 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి 414 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ నగరంపై వలస వచ్చేవారి వత్తిడిని తగ్గించేందుకు ఉద్దేశించిన కౌంటర్-మాగ్నెట్ నగరాల్లో ఇది ఒకటి.
చిత్తోర్‌ఘర్ కోట, రాజస్థాన్
చిత్తోర్‌గఢ్‌ను 'కోటల నగరం' అని పిలుస్తారు. ఈ కోటలలో చిత్తోర్‌ఘర్ కోట కూడా ఉంది. ఈ కోట బెరాచ్ నది ఒడ్డున నిర్మించబడింది. అందుకే దీనిని నీటి కోట అని కూడా అంటారు. ఈ కోటలో 84 నీటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ కోట మహారాణా ప్రతాప్ ధైర్యానికి నిదర్శనం. చిత్తోర్‌ఘర్ కోట ఆరావళి ఆగ్నేయ పీఠభూమిపై నిర్మించబడింది. ఇది నేల స్థాయి నుండి 500 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కోట సుమారు 8 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణంలో భారతదేశంలోనే అతిపెద్ద కోటగా పేరు గాంచింది. 5వ మరియు 8వ శతాబ్దాల మధ్య మౌర్యులచే నిర్మించబడింది.



Click it and Unblock the Notifications













