Search
  • Follow NativePlanet
Share
» »ఛార్‌ధామ్ యాత్ర‌లో మే 31 వ తేదీ వరకు వీఐపీ దర్శనాలు రద్దు...

ఛార్‌ధామ్ యాత్ర‌లో మే 31 వ తేదీ వరకు వీఐపీ దర్శనాలు రద్దు...

చార్ ధామ్ యాత్రకు ప్ర‌తి సంవ‌త్స‌రం వేలాది మంది భ‌క్తులు తండోప‌తండాలుగా త‌ర‌లివెళ్తుంటారు. ఇక‌, ఈ ఏడాది మే 10 వ‌తేదీన ఈ యాత్ర ప్రారంభ‌మైంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యాత్రికులు ఉత్తరాఖండ్ బాట పట్టారు. ఈ చార్‌ధామ్ యాత్ర‌లో భాగంగా ఉత్త‌రాఖండ్‌లో ఉన్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను భ‌క్తులు సంద‌ర్శించుకుంటారు.

ప్ర‌తి ఒక్క భ‌క్తుడు ఈ చార్‌ధామ్ యాత్ర‌లో పాల్గొనాల‌ని అనుకుంటాడు. ఈ యాత్ర‌లో పాల్గొనేవారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈసారి చార్‌ధామ్ యాత్ర‌కు వెళ్లేవారికి ఓ ముఖ్య గ‌మ‌నిక‌.. ఛార్‌ధామ్ యాత్ర‌లో వీఐపీ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. అది కూడా ఈనెల 31 వ తేదీ వ‌ర‌కు ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయి.

చార్‌ ధామ్ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్న క్ర‌మంలో ఉత్త‌రాఖండ్ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ యాత్ర‌కు కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని మాత్రమే అనుమ‌తిస్తున్న‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు. ఇప్పటికే చార్ ధామ్ యాత్ర కోసం సుమారు 26 లక్షలకుపైగా యాత్రికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రక‌టించింది.

vipdarshanscanceledtill31stmay

అయితే ఈసారి చార్ ధామ్ యాత్ర మే 10 వ తేదీన ప్రారంభం అయింది. ప్రారంభ‌మ‌యిన రోజు నుంచే నిత్యం వేల సంఖ్యలు యాత్రికులు బారులు తీర‌డంతో వారికి దర్శనాలు కల్పించడం అధికారులకు ఎంతో క‌ష్టంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే వీఐపీ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తొలి 15 రోజుల్లోనే అంటే ఈ నెల 25 వ తేదీ వ‌ర‌కు వీఐపీ ద‌ర్శ‌నాలు చేయ‌గా, తాజాగా దాన్ని ఈ నెల 31 వ తేదీవ‌ర‌కు పొడిగించింది. వీఐపీ దర్శనాల రద్దును మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు అన్నీ రాష్ట్రాల సీఎస్‌లకు రాసిన లేఖలో ఉత్తరాఖండ్ సీఎస్ వివ‌రించారు.

రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి..

ఇప్ప‌టికే చార్ ధామ్ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు క్యూలైన్లు నిలిచిపోయాయి. యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటిని ప‌రిష్క‌రించే క్ర‌మంలో అధికారులు ఈనిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌, ఛార్‌ధామ్ యాత్ర‌కు వెళ్లేవారు త‌ప్ప‌కుండా రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. చార్ ధామ్ యాత్రకు వెళ్లాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. యాత్రికులు ఉత్త‌రాఖండ్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇత‌ర పూర్తి స‌మాచారం కోసం, రిజిస్ట్రేష‌న్ కోసం యాత్రికులు ఈ వెబ్‌సైట‌న్ https://registrationandtouristcare.uk.gov.in/ స‌ంప్ర‌దించ‌గ‌ల‌రు. ఇక వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు యాత్రకు ముందే మెడికల్ టెస్ట్‌లు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారు ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.

11 మంది మృతి..

ఈ యాత్ర కోసం ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా మొత్తం 26 లక్షలకు పైగా యాత్రికులు రిజిస్టర్ చేసుకున్నట్లు అధికారులు ప్ర‌క‌టించారు. అయితే, ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు భావిస్తున్నారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా ముందుగా యమునోత్రి దర్శనం ఉంటుంది. అనంత‌రం గంగోత్రి, కేదార్‌నాథ్ క్షేత్రాలను సందర్శిస్తారు. చివరికి బద్రీనాథ్ చేరుకుంటారు.

ఈ చార్ ధామ్ యాత్రకు వెళ్లేవారికి రోడ్డు మార్గం, హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయి. ఈసారి చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన వారం రోజుల్లోనే ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. అందుకే రిజిస్ట్రేషన్‌ చేయించుకోని భక్తులను చార్‌ధామ్ యాత్రకు అస్సలు అనుమతించేది లేదని ఉత్త‌రాఖండ్ అధికారులు స్ప‌ష్టం చేశారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+