Search
  • Follow NativePlanet
Share
» »గురుగ్రామ్‌లో విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్‌..

గురుగ్రామ్‌లో విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్‌..

గురుగ్రామ్‌లో విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్‌..

విరాట్ కోహ్లీ.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుని, దేశంలోనే కాకుండా, విశ్వ వ్యాప్తంగా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ. అయితే, కోహ్లీ కేవ‌లం క్రికెట్‌లోనే కాకుండా వివిధ రంగాల్లో కూడా మ‌క్కువ చూపుతున్నారు. ఆయ‌న‌కు వ్యాపార రంగం అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఇప్ప‌టికే ఆయ‌న‌కు న‌చ్చిన కొన్నిరంగాల్లో పెట్టుబ‌డులు పెట్టారు. షూష్‌, క్లాత్స్‌, హాస్పిటాలిటి రంగాలు.. ఇవే కాకుండా, ఢిల్లీతోపాటు కోల్‌క‌తా, పూణే, ముంబై వంటి మ‌హాన‌గ‌రాల్లో సైతం రెస్టారెంట్స్‌ను న‌డిపిస్తున్నాడు. అయితే, ఈ రెస్టారెంట్స్‌కు జెర్సీ నెంబ‌ర్ 18 వ‌చ్చేలా వ‌న్ 8 క‌మ్యూన్ పేరుతో అన్నిన‌గ‌రాల్లో రెస్టారెంట్ల‌ను ప్రారంభిస్తున్నారు. తాజాగా, గురుగ్రామ్‌లో కూడా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు దాని ప్ర‌త్యేక‌త‌లేంటో ఓసారి చూద్దాం.

ఇప్పుడు కొత్త‌గా ప్రారంభించిన రెస్టారెంట్ 7వది కావ‌డం విశేషం. ఇప్ప‌టికే కోహ్లీ వివిధ న‌గ‌రాల్లో వ‌న్ 8 క‌మ్యూన్‌పేరుతో రెస్టారెంట్ల‌ను ప్రారంభించారు. ఇది ప్రముఖ స్టూడియో రెనెసాస్ రూపొందించిన M3M ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్‌లో ఉంది.

రెస్టారెంట్‌లో రుచికరమైన రుచులు

One8 కమ్యూన్ రెస్టారెంట్ వినూత్న అభిరుచులకు ప్రసిద్ధి చెందింది. ఈ రెస్టారెంట్‌లో దేశీయ వంట‌కాల‌తో పాటు, వీదేశీ వంట‌కాలు సైతం ఇక్క‌డి జాబితాలో చేర్చ‌బ‌డ్డాయి. ఈ రెస్టారెంట్ లోపల నుండి చాలా విలాసవంతంగా ఉంటుంది. ట్రూ ప్యాలేట్ కేఫ్‌లోని వన్ 8 కమ్యూన్‌ను రెనెసాస్ ప్రత్యేకంగా రూపొందించారు. రెస్టారెంట్ లోపల ఎంతో అందంగా వివిధ లైట్ల‌తో అలంకరించబడి ఉంటుంది. ఈ హోట‌ల్‌లోని ప్ర‌తి గోడ‌లు అత్యంత అంద‌మైన డిజైన‌లతో చేయబడ్డాయి. ఈ గోడ‌ల‌కు వేసిన డిజైన్‌లు గోల్డ్ కలర్‌తో పాటు మావ్, లావెండర్ మరియు పింక్ కలర్స్‌లో ఉంటాయి.

1

ఇక్కడ ఎలాంటి వంటకాలు ఉన్నాయి..

ఇందులో స్పఘెట్టి చెర్రీ టొమాటో స్టూ, టొమాటో బార్లీ రిసోట్టో, గుమ్మడికాయ క్రోక్వేట్స్, నాసి గోరెంగ్ వంటి 40 కంటే ఎక్కువ వంటకాలు ఉన్నాయి. విరాట్ One8 బ్రాండ్ ఆదాయం 112 కోట్ల రూపాయలు ఉండోచ్చ‌ని ఓ నివేదిక‌లో తేలింది. విరాట్ తన సోదరుడు వికాస్ కోహ్లీతో కలిసి ఈ వ్యాపారాల‌ను నడుపుతున్నాడు.

ముంబైలోని రెస్టారెంట్ ప్ర‌త్యేక‌త‌లు..

ఈ వ‌న్‌8 క‌మ్యూన్ రెస్టారెంట్ ముంబ‌యిలో కూడా ఉంది. లెజండరీ సింగర్ కిశోర్ కుమార్ కు చెందిన బంగ్లాలో ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ముంబైలోని కిశోర్ కుమార్ కు చెందిన గౌరీ కుంజ్ పోర్షన్ ను కోహ్లీ దంపతులు ఐదేళ్లపాటు లీజుకు తీసుకున్నారు. విరాట్ కోహ్లీ టాలిస్మానిక్ బ్యాటర్ 'వన్8 కమ్యూన్' పేరుతో రెస్టారెంట్లను ప్రముఖ నగరాల్లో ఏర్పాటు చేశాడు. ముంబైలోని లెజండరీ సింగర్ కిశోర్ కుమార్ కు చెందిన బంగ్లాలో ఈ రెస్టారెంట్ ఎందుకు ప్రారంభించాడో కూడా కోహ్లీ ఇంత‌కుముందే వివరించాడు. తనకు కిశోర్ దాస్ అంటే ఎంతో ఇష్టమని, ఆయన పాడిన పాటలు వ్యక్తిగతంగా తన హృదయాన్ని తాకాయని, తనను ఎంతో ప్రభావితం చేశాయని, తన కాన్సెప్ట్ కు సరిగ్గా ఈ ప్ర‌దేశం సరిపోతుందని, అందుకే ఈ బంగ్లాలో రెస్టారెంట్ ఏర్పాటు చేసిన‌ట్లు గ‌తంలో చెప్పిన సంగ‌తి అందిరికి తెలిసిందే..

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+