ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం మనదేశంలో నిర్మిస్తున్నారు. అది కూడా రామాలయం కావడం విశేషం. ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాముని ఆలయాన్ని అయోధ్యలో నిర్మించారు. ఇప్పడు అలాంటి మరో రామాలయాన్ని మనదేశంలో నిర్మించనున్నారు. అది కూడా అయోధ్య రామాలయం కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉండే ఆలయం. అది ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయంగా చరిత్రకెక్కనుంది. ఇక, ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం.
జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన అంగరంగ వైభవంగా జరిగింది. అయితే అయోధ్య రామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్ద రామ మందిర నిర్మాణం కూడా ప్రారంభమైందన్న విషయం ఎంతమందికి తెలుసు. ఈ ఆలయం విదేశాల్లో కాదు మనభారత్‌లోనే నిర్మిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో దేశంలోని అత్యంత పెద్ద దేవాలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఆలయం తూర్పు చంపారన్‌లోని కథ్వాలియాలో నిర్మిస్తున్నారు.
ఈ ఆలయ నమూనాను వంబర్ 13, 2013న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆలయ పేరు విరాట్ రామాయణ దేవాలయంగా పిలుస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణ పనులు మే 2023న ప్రారంభమయ్యాయి. ఈ శ్రీరాముని ఆలయం అయోధ్య రామాలంటే కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉండనుంది.
ఈ ఆలయం 2025 చివరి నాటికి పూర్తి కానుంది. ఈ శ్రీరాముని ఆలయం మొత్తం 25 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటుంది. దీన్ని 200 ఎకరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని వైశాల్యం 3.67 లక్షల చదరపు అడుగులు. ఈ భారీ రామాయణ దేవాలయం పొడవు 1080 అడుగులు ఉంటుంది. వెడల్పు 540 అడుగులు. ఈ ఆలయాన్ని మొత్తం 3,102 స్తంభాలతో నిర్మిస్తున్నారు. ఈ ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాత అయోధ్య నుంచి జనక్‌పూర్ వైపు వెళ్లేటప్పడు ఈ రామలయం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆలయంగా ఉండబోతుంది.

ఈ ఆలయ నిర్మాణానికి రూ. 500 కోట్లు...
ఈ ఆలయాన్ని తిహారిలోని కైత్వాలియాలో నిర్మిస్తున్నారు. ఈ విరాట్ రామాయణ ఆలయ ప్రణాళిక 2012లోనే ప్రారంభమైంది. దీనిని కైత్వాలియా గ్రామంలోని కేసరియా-చైకా రహదారి పక్కన నిర్మిస్తున్నారు. ఈ ప్రదేశం వైశాలి నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక, పాట్నా నుండి అయితే, సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కంపూచియా లేదా కంబోడియాలోని అంగ్‌కోర్ వాట్ రూపకల్పన ఆధారంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఆలయ ప్రధాన శిఖరం అంగ్‌కోర్ వాట్ యొక్క 215 అడుగుల శిఖరం కంటే దాదాపు రెట్టింపు ఉంటుంది. అంటే ఈ ఆలయ ఎత్తు సుమారు 405 అడుగుల ఎత్తు ఉంటుందని అంచనా. ఈ ఆలయ మొత్తం నిర్మాణానికి రూ. 500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది పాట్నాలోని మహావీర్ టెంపుల్ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా చెప్పవచ్చు.
ఈ ఆలయంలో 108 అడుగుల ఎత్తులో ఐదు శిఖరాలను నిర్మించనున్నారు. ఈ ప్రధాన ఆలయం ముందు, 20,000 మంది సామర్థ్యంతో భారీ ప్రార్థనా మందిరం కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు. ఈ ఆలయంలో మొత్తం 18 మంది దేవతలు, 18 గర్భాలయాలు ఉండబోతున్నాయి. ఇందులో ప్రధానంగా శ్రీరాముడు మధ్య శిఖరంలో కూర్చుంటాడు. అక్కడే సీతామాతా, లవకుశల విగ్రహాలను కూడా ప్రతిష్టించనున్నారు.



Click it and Unblock the Notifications













