డిస కిట్ ఆరామం సుమారు 350 సంవత్సరాల కిందటిది. ఇది దిస్కిట్ గ్రామం లో కలదు. ఈ ఆరామం సముద్ర మట్టానికి సుమారు 10310 అడుగుల ఎత్తులో కలదు. నుబ్రా వాలీకి ఈ గ్రామం ఒక పాలిత ప్రాంతంగా వుంటుంది. ఇక్కడ చాలా ప్రభుత్వ ఆఫీసులు కలవు. ఈ గ్రామానికి దిస్కిట్ ఆరామం లేదా దిస్కిట్ గోపా ప్రధాన ఆకర్షణ. నుబ్రా వాలీ లో ఇది అతిపెద్ద మరియు పురాతన బౌద్ధ ఆరామం.
ఈ డిస కిట్ అరామాన్ని 14 వ శతాబ్దంలో త్సోంగ్ ఖాప శిష్యుడు అయిన చాంగ్ జెం త్సేరాబ్ జాన్గ్పో కనిపెట్టాడు. గోపాలో మైత్రేయ బుద్ధ విగ్రహం, పెయింట్ లు, డ్రమ్ములు, వుంటాయి. ఈ ఆరామం అంతా టిబెట్ సంస్కృతి మరియు టిబెట్ శిల్ప శైలి. పర్యాటకులు అందమైన పెయింటింగ్ లను చూడవచ్చు. ఈ ఆరామంలో ఇంకా రెండు బౌద్ధ దేవాలయాలు కలవు. అనేక టిబెట్ మరియు మంగోలియా భాషల గ్రంధాలు కూడా కలవు.
డిస కిట్ గోమ్పా లో సుమారు 100 మంది బౌద్ధ సన్యాసులు ప్రపంచం లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చినవారు వుంటారు. ఇక్కడ స్కేపే గొట్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లో జరుగుతుంది ఈ ఫెస్టివల్ లో టూరిస్టులు చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్సనంగా ముఖాలకు ముసుగులు వేసుకొనే లామాలు నాట్యం చేయడం చూస్తారు.



Click it and Unblock the Notifications