Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నూర్పూర్

నూర్పూర్ - నూర్జహాన్ రాణి మెచ్చిన ప్రదేశం!

8

నూర్పూర్, హిమాచల్ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలోని ఒక చిన్న నగరం. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 643 మీటర్ల ఎగువన ఉంది. స్వాతంత్ర్యానికి ముందు ఈ ప్రాంతాన్ని పఠా నియా వంశపు రాజపుత్రులు పాలించారు. తన్వర్ వంశపు చద్రవంశ రాజపుత్రులు ఈ ప్రాంతాన్ని 800 ఏళ్ళు పాలించారనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఈ కాలంలో, పఠాన్ కోట్ ఈ ప్రాంత రాజధానిగా ఉండేది.

గతంలో నూర్పూర్ను ధమేరి అనే పేరుతో పిలిచేవారు, కాని తర్వాత నూర్జహాన్ మహారాణి పేరును పెట్టారు. జానపదాల ప్రకారం, నూర్జహాన్ మహారాణి ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, ఈ ప్రాంత అందానికి మంత్రముగ్ధురాలైంది. అందువల్ల, ఈ ప్రాంతంలో తన భవనాన్ని నిర్మించుకోవడానికి ఆమె నిర్ణయించుకొంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన పఠానియా వంశపు జగత్ సింగ్ మహారాజు తన సామ్రాజ్యంలో మొఘలుల జోక్యానికి ఇష్టపడలేదు. అందువల్ల, మహారాజు ఈ ప్రాంతంలోని వాతావరణం గోయిత్రిని కల్గజేస్తుందనే పుకారును పుట్టించాడు, ఇది ఈ ప్రాంతంలో అతి వేగంగా వ్యాపించే ఒక ప్రత్యేక వ్యాధి. ఫలితంగా, నూర్జహాన్ మహారాణి ఈ ప్రాంతంలో తన భవనాన్ని నిర్మించుకొనే ఆలోచనను విరమించుకొంది. తర్వాత, జగత్ సింగ్ పఠానియ నూర్జహాన్ మహారాణి గౌరవార్ధం ఈ ప్రాంతానికి 1622 వ సంవత్సరంలో నూర్పూర్ అనే పేరును పెట్టాడు.

మామిడిపళ్ళు, నారింజలు, లిచి, ఉసిరి ఈ ప్రాంతంలో దొరికే కొన్ని ప్రసిద్ది చెందిన పళ్ళు. కోళ్ళ పెంపకం, నూర్పూర్ వాసుల ప్రధాన వృత్తులలో ఒకటి. దీనితో బాటుగా నూర్పూర్ సిల్క్, పష్మిన శాలువాలు పర్యాటకులలో ఎంతో ప్రసిద్ది చెందాయి.

ఈ ప్రాంతంలోని రెండు పేరొందిన ఆలయాలు నాగిని మాత ఆలయం, బ్రిజ్ రాజ్ స్వామి ఆలయం పర్యాటకులకు సిఫార్సు చేయబడినవి. దీంతోపాటు, పఠానియా పాలకులు 10వ శతాబ్దంలో నిర్మించిన నూర్పూర్ కోటను పర్యాటకులు తప్పనిసరిగా చూడాలి. చాలావరకు కోట శిధిలావస్థలో ఉంది, అయినప్పటికీ పురావస్తులో ఆసక్తి ఉన్న పర్యాటకులు ఈ కోట నిర్మాణ శైలిని చూడవచ్చు.

నూర్పూర్ సందర్శనకు, పర్యాటకులు కాంగ్రా జిల్లాలో ఉన్న గగ్గల్ విమానాశ్రయం వరకు విమానాల ద్వారా రావచ్చు. కాంగ్రా విమానాశ్రయం నుండి అమృత్ సర్, చండీగఢ్, జమ్మూ వంటి భారత ప్రధాన నగరాలకు మార్గం ఉంది. నూర్పూర్ చేరడానికి పఠాన్ కోట్ రైలు స్టేషన్ అతి దగ్గరగా కాంగ్రా నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైగా, నూర్పూర్ ను బస్సు ద్వారా కూడా చేరవచ్చు, ధర్మశాల, పాలంపూర్, పఠాన్ కోట్, జమ్మూ, అమృత్ సర్, చండీగఢ్ నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రాంతంలో వాతావరణం శీతాకాలంలో తప్ప ఏడాదిలోని మిగిలిన కాలంలో చాలావరకు ఒక మోస్తరుగా ఉంటుంది. ఈ ప్రాంత సందర్శనకు సెప్టెంబర్ నుండి జూన్ నెలల మధ్య కాలం ఉత్తమమైనది.

నూర్పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నూర్పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నూర్పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నూర్పూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా: పర్యాటకులకు రాష్ట్ర రవాణా సంస్థ, ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉండే ధర్మశాల, పాలంపూర్, పఠాన్ కోట్, జమ్మూ, అమృత్ సర్, చండీగఢ్ వంటి ప్రాంతాల నుండి నూర్పూర్ చక్కటి రోడ్డు మార్గం ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా : నూర్పూర్ నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠాన్ కోట్ బ్రాడ్ గేజ్ రైలు స్టేషన్ అతి దగ్గరి మార్గం. ఈ రైలు స్టేషన్ నుండి ప్రయాణీకులు టాక్సీలు, క్యాబ్ల ద్వారా నూర్పూర్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ద్వారా : నూర్పూర్ కు 51 కిలోమీటర్ల దూరంలో గగ్గల్ అతి దగ్గరి విమానాశ్రయం. ఇతర దగ్గరలోని ప్రధాన విమానాశ్రయాలు 255 కిలోమీటర్ల దూరంలోని చండీగఢ్, 151 కిలోమీటర్ల దూరంలోని అమృత్సర్, కేవలం 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మూ. విమానాశ్రయం నుండి నూర్పూర్ కు పర్యాటకులు టాక్సీలు, క్యాబ్ల ద్వారా సులువుగా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue