పట్నితోప్ సమీపంలోని సుధ్ మహదేవ్, హిందూ మత దైవం శివుడనికి అంకితం గావించబడ్డ 2,800 సంవత్సరాల ఆలయం. పురాణానుసారం, సుధీతుడు అనే ఒక రాక్షసుడు శివుని పట్ల తన భక్తిని చూపించడానికి రాగా, ఆ సమయంలో, శివుని దేవేరి పార్వతీదేవి, శివ లింగాన్ని పూజించడంలో నిమగ్నం అయి ఉంది. హఠాత్తుగా, అసురుణ్ణి చూసిన ఆమె భయపడి గట్టిగా కేక పెడుతుంది. అప్పుడు వరకు నిద్రలో ఉన్న పరమశివుడు ఆ అరుపుకు నిద్రలేచి, ఉలికిపడి, అసురుని పై తన త్రిశూలము విసురుతాడు. అంతలోనే, తన తప్పు తెలుసుకుని, తిరిగి ప్రాణదానం చేయబోగా, సుధీతుడు, దేవుని చేతిలో మరణించడం ద్వారా దక్కిన మోక్షాన్ని కోరుకుంటాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత, ఈ ప్రదేశం సుధ్ మహదేవ్ అనే పేరు పొందినది. త్రిశూలం యొక్క అవశేషాలు ఆలయం లోపల ఉన్నట్లు భావిస్తారు.
ఈ ఆలయం, బాబా రూప్ నాథ్, వేల సంవత్సరాల క్రితం, సమాధి చెందిన ప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇంకా మండుతూనే ఉన్న, బాబా రూప్ నాథ్ యొక్క ధూని లేదా 'అనంత జ్వాల'ని, ఈనాటికీ ఆలయం వద్ద చూడవచ్చు. జూన్ నెల లోని పౌర్ణమి రాత్రి ,‘జ్యేష్ఠ పూర్ణిమ' సందర్భంగా, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించుకుంటారు. మరొక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ, మంతాలై ఆశ్రమము, సమీపంలోనే ఉంది.



Click it and Unblock the Notifications