పాండిచేరి మ్యూజియం, పాండిచేరి

హోమ్ » ప్రదేశములు » పాండిచేరి » ఆకర్షణలు » పాండిచేరి మ్యూజియం

పాండిచేరి మ్యూజియం, పాండిచేరిలో తప్పనిసరిగా మర్చిపోకుండా చూడవలసిన మరొక ప్రదేశం. మ్యూజియం లోపల గల గాలరీలో అరికమేడు రోమను ఒప్పందానికి చెందిన శిల్పాలు, అనేక ముఖ్యమైన పురావస్తు పరిశోధనలు ఉన్నాయి. ఈ మ్యూజియం పురాతన కాలానికి చెందిన అరుదైన కళాఖండాలకు నిలయం. చోళ, పల్లవుల వంశాలకు చెందిన అరుదైన కాంస్యం, రాతి శిల్పాలు ఇక్కడి ప్రదర్శకాలలో ఉన్నాయి. ఈ మ్యూజియంలో పాండిచేరి ప్రాంతం నుండి సేకరించి తీసుకొని వచ్చిన గవ్వలు కూడా ఉన్నాయి.

ఈ మ్యూజియంను సందర్శించే వారికీ భారతదేశంలో ఫ్రెంచి వారి వలస పాలనకు చెందిన విషయాలను పాండిచేరి గత కాలపు వలస పాలన ద్వారా తెల్సుకొనే అవకాశం కలుగుతుంది. పాండిచేరి వచ్చిన తర్వాత మ్యూజియానికి వెళ్ళడం చాల సులువు. ఇది భారతి పార్కు లో ఉంది.

Please Wait while comments are loading...