కారైకాల్ పర్యాటక ప్రదేశం - దేవాలయాల యొక్క పట్టణం

కారైకాల్, ఒక పురాతన ఆలయం, లార్డ్ శనీశ్వర దేవాలయానికి ప్రసిద్ధి చెందింది. ఈ పర్యాటక ప్రదేశాన్ని దర్శించటానికి వేల సంఖ్యలో పర్యాటకులు మరియు యాత్రికులు వొస్తారు. ఇక్కడ ఉన్న ఇసుక బీచ్, నగరం యొక్క గొప్ప ఫ్రెంచ్ సాంస్కృతిక వారసత్వం, అందమైన ఆలయాలు మరియు పోర్ట్, అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి.

కారైకాల్, ఇది పాండిచేరి కేంద్ర పాలిత ప్రాంతం లో బంగాళాఖాతం యొక్క కోరమండేల్ తీరం మీద ఉన్న ఒక కీలకమైన రేవు పట్టణం. ఇది దక్షిణ పాండిచేరి పట్టణానికి 132 కిలోమీటర్లు మరియు దక్షిణ చెన్నై కి 300 కిలోమీటర్లు మరియు తూర్పు తిర్చికి 150 కిలోమీటర్లు దూరంలో ఉన్నది.

పాండిచేరి యొక్క కేంద్రపాలిత డెల్టా ప్రాంతాలలో ఈ ప్రాంతం రెండవ స్థానంలో ఉన్నది. ఈ ప్రాంతానికి కారైకాల్ అని పేరు పెట్టటంలో చాలా కారణాలు చెపుతుంటారు. ఈ ప్రాంతం యొక్క పేరు 'కారై' మరియు 'కాల్' అనే రెండు మాటల కలయిక. ఈ ప్రాంతం పేరుకి అత్యంత నిజమైన సాక్ష్యంగా ఉన్న ఒక అర్థం "నిమ్మ మిశ్రమంతో తయారైన ఒక కాలువ".

అయితే, ఈ రోజు వరకు ఇటువంటి కాలువను చూడలేదు. జూలియన్ విన్సన్ ప్రకారం, పట్టణానికి సంస్కృత పేరు 'కరగిరి' ఉండేది అని చెప్పవొచ్చు. ఇంపీరియల్ గజాట్టీర్ ప్రకారం కారైకాల్ అంటే 'ఫిష్ పాస్' అని అర్థం. ఒక పర్యాటక హెవెన్ మరియు దేవతల యొక్క ఒక నివాసం-కరైకల్ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు.కారైకాల్ దేవాలయాలకి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలోని ప్రధాన ఆకర్షణలు శనీశ్వర దేవాలయం, శ్రీ కైలాసనాథర్ ఆలయం, నవగ్రహ ఆలయాలు మరియు అమ్మియార్ దేవాలయం. ఆలయాల సందర్శనం తరువాత, బీచ్ లో విశ్రాంతి తీసోకోవొచ్చు మరియు బంగాళాఖాతంలో బోటింగ్ చేయవొచ్చు.పురావస్తు ప్రాధాన్యత సంతరించుకున్న కీజ్హ కాసకుడి మరియు మేళా కాసకుడి వంటి కొన్ని గ్రామాలు కూడా కారైకాల్ లో ఉన్నాయి. నాగోర్ మరియు వేలంకాన్ని వంటి ప్రముఖ యాత్రాస్థలాలు కూడా కారైకాల్ కు సమీపంలో ఉన్నాయి.చరిత్ర మరియు సంస్కృతి

ఈ ప్రాంతం భారతదేశం యొక్క అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దర్శనీయ ప్రదేశాలలో ఒకటి; కారైకాల్ చాలా గొప్ప చరిత్ర మరియు సంస్కృతిని కలిగి ఉంది. దీని చరిత్ర ఇది ఎనిమిదో శతాబ్దం పల్లవ రాజ్యంలో భాగంగా ఉన్నప్పటినుండి ప్రారంభమయింది.

అయితే, ఆ తరువాత, దీని చరిత్ర దీర్ఘ కాలం పాటు అస్పష్టంగానే ఉన్నది. ఇది మరల 18 వ శతాబ్దంలో తంజావూరు రాజుల సమయంలో వెలుగులోకి వొచ్చింది. 1738 లో, తంజావూర్ మరియు కారైకాల్ యొక్క సాహుజితో చర్చలు డుమస్ అనే పేరుతో ఒక ఫ్రెంచ్ గౌరవనీయుడు జరిపాడు మరియు దీనిని 1739 లో ఫ్రెంచ్ వారు జయించారు.

1761లొ బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారిని ఓడించారు మరియు ఈ ప్రాంతమంతా బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. అయితే, 1814 నాటి పారిస్ ఒప్పందానికి అనుగుణంగా, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారికి తిరిగి భూభాగాన్నిస్వాధీనం చేశారు మరియు 1954 వరకు ఈ భూభాగమంతా ఫ్రెంచ్ వారిక్రిందే ఉన్నది. అందువలన కారైకాల్ పట్టణం ఇప్పటికీ గొప్ప ఫ్రెంచ్ సంస్కృతి మరియు సంప్రదాయం కలిగి ఉన్నది.

కారైకాల్ చేరుకోవడం ఎలా?

కారైకాల్ కు సమీపంలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది. ఈ విమానాశ్రయం దీనికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నది మరియు దీనిని చేరుకోవటానికి రోడ్ మార్గం ద్వారా 7-9 గంటల సమయం పడుతుంది. కారైకాల్ కు సమీపంలో తిర్చిడొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ ఉన్నది. కారైకాల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ ప్రక్రియ ఇంకా జరుగుతున్నది, దీనిని 2014 నాటికి పూర్తిచేస్తారు. కారైకాల్ కు 10 కి. మీ. అవతల నాగోర్ రైల్వే స్టేషన్ ఉన్నది. పాండిచేరి మరియు తమిళ్ నాడు ప్రాంతాలలో గల అన్ని ముఖ్యమైన ప్రాంతాలనుండి చాలా తరుచుగా ప్రైవేటు సంస్థలు కారైకాల్ చేరుకోవటానికి సేవలు అందిస్తున్నాయి. స్థానిక రవాణా, ఆటో రిక్షాలు మరియు బస్సుల రూపంలో సులభంగా అందుబాటులో ఉన్నాయి.

కారైకాల్ వాతావరణం

దక్షిణ భారతదేశం యొక్క ఇతర ప్రదేశాల లాగానే, కారైకాల్ కూడా చాలా తీవ్రమైన వేసవిని ఎదుర్కుంటున్నది. అందువలన కారైకాల్ ను సందర్శించాలంటే శీతాకాలం, నవంబర్ మరియు ఫిబ్రవరి నెలల మధ్య అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం ఉపశాంతి నిచ్చే విధంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రశాంతత, నిశ్శబ్దం మరియు ఏకాంతం కోరుకునే ప్రజలకు కారైకాల్ బీచ్ ఆదర్శప్రాయంగా ఉన్నది.

 

Please Wait while comments are loading...