చర్చ్ ఆఫ్ సేక్రేడ్ హార్ట్ ఆఫ్ జీసస్, పాండిచేరిలోని ముఖ్యమైన చర్చిలలో ఒకటి. గోతిక్ నిర్మాణ శైలిలో కట్టిన ఈ చర్చి ఏడాది పొడవునా అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. యేసు క్రీస్తు జీవిత చరిత్రను, కాలాన్ని తెలిపే అద్దాల కిటికీలు ఈ చర్చిలో ఎంతో ముఖ్యమైన, గమనించదగిన లక్షణాలలో ఒకటి. ఈ చర్చి చూడటానికి వచ్చిన సందర్శకులు నిర్మలమైన ప్రశాంతతను పొందుతారు. ఈ చర్చిలో మొదటి కూడిక 1907 డిసెంబర్ 17 వ తేదీన జరిగింది. చర్చి చుట్టూ చర్చి సమాజాన్ని 1908 లో స్థాపించారు. ఇటీవల కాలంలో 2008 లో ఈ చర్చి శతాబ్ది ఉత్సవాలను జరుపుకొంది.