పూవార్ బీచ్ ప్రశాంతమైన, సముద్రపు నీరు మరియు పచ్చని తాటి చెట్లు చుట్టూ కలిగి ఉంది. ఈ గ్రామం తిరువనంతపురానికి 38 కి. మీ. ల దూరం లో కలదు. సహజ ఓడ రేవు అయిన విజింజం నుండి బోటు లో కూడా ప్రయాణించ వచ్చు. కోవలం బీచ్ నుండి ఒక కయ్యి చే ఇది వేరు పరచబడింది.
సముద్రపు పోటు వచ్చినపుడు ఈ బీచ్ సముద్రానికి ఒక కయ్యి చే కలుపబడి ఉంటుంది. సముద్రపు నీరు, ఒక సరస్సు నీరు, మరియు ఒక నది నీరు , మూడు కలిసే ప్రాంతం ఇది. ఇక్కడ ఎన్నో రిసార్ట్ లు కలవు. రిసార్ట్స్ మంచి సేవలు అందిస్తాయి. మీ సొమ్ముకు తగిన ఆనందాలు తప్పక మీకు లభిస్తాయి. ఆయుర్వేద చికిత్సలు, షాపింగ్, రుచికర స్థానిక ఆహారాలు లభిస్తాయి. ప్రవాహాల అతి వేగం కారణంగా, ఇక్కడ స్విమ్మింగ్ సూచించ దగినది కాదు.