అందమైన ఈ వైల్డ్ లైఫ్ సంక్చురి రెండు జిల్లాలుకు చెందినది. అవి పోర్ బందర్ మరియు జం నగర్. ఈ సంక్చురి పోర్బందర్ కు 15 కి.మీ.ల దూరంలో కలదు. ఇది ఒక రిజర్వు ఫారెస్ట్ కాగా 1979లో సంక్చురిగా ప్రకటించారు. అందమైన కొండ మార్గాలతో, మైదాన భూమితో, చిన్నపాటి నీటి వాగులతో, చుట్టూ పచ్చని అడవి మరియు వ్యవసాయ భూములు కలిగి వుంటుంది.
అరేబియా సముద్రం నుండి 15 కి.మీ.ల దూరంలో వుంది. ఆ ప్రాంతానికి సముద్రపు ఉప్పు తగలకుండా కాపాడుతుంది. కనుమరుగవుతున్న అనేక జంతువులు, పక్షులు, పాములు , ఈ సంక్చురిలో కలవు. ఈ సంక్చురి సుమారు 192.31 చ.కి.మీల విస్తీర్ణం లో వుండి ఎన్నో ఔషధ మొక్కలను కూడా కలిగి వుంది. ఇక్కడ రెండు చిన్న నదులు కూడా ప్రవహిస్తున్నాయి.



Click it and Unblock the Notifications