Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పులికాట్ » వాతావరణం

పులికాట్ వాతావరణం

ఉత్తమ సమయం పులికాట్ లో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటు౦ది. తీవ్ర వేసవి, నిరంతర వర్షాలుండే సమయాల్లో ఇక్కడికి వెళ్లకపోవడం మంచిది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో అభాయారణ్యాన్ని సందర్శించడానికి, విహంగ వీక్షణానికి మంచి సమయం. ఫ్లెమింగో ఉత్సవం చూడాలనుకునే వారు మాత్రం డిసెంబెర్, జనవరి నెలల్లో ఇక్కడికి రావాలి.

వేసవి

వేసవిప్రధానంగా ఉష్ణమండల వాతావరణం వుండే పులికాట్ లో వేసవి తీవ్రమైన వేడిగాను, తేమగాను వుంటుంది. మార్చి నెలలో మొదలయ్యే వేసవి మే చివరిదాకా వుంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు కూడా చేరుకుంటుంది, ఐతే రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత బాగా పడిపోతుంది. ఏడాది లో మే చాలా వేడిగా వుండడం వల్ల ఆ సమయంలో స్థల సందర్శన, విహంగ వీక్షణానికి అనుకూలం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం నైరుతి, ఈశాన్య ఋతుపవనాల వల్ల పులికాట్ లో విస్తారమైన వర్షాలు కురుస్తాయి. జూన్ లో మొదలయ్యే వర్షాకాలం సెప్టెంబర్ దాకా వుంటుంది. ఈశాన్య ఋతుపవనాల వల్ల ఈ ప్రాంతంలో అక్టోబర్ లో భారీ వర్షాలు కురుస్తాయి. వేసవి లోని తీవ్రమైన వేడి నుంచి వర్షాకాలం విముక్తి నిస్తుంది.

చలికాలం

శీతాకాలం పులికాట్ లో శీతాకాలం హాయిగాను, స్వాగతించేది గాను వుంటుంది. శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి దాకా వుంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఈ సమయంలో ఈ పట్టణాన్ని సందర్శించడానికి మంచిది.