జడ తీర్థం రామేశ్వరం నుండి ధనుష్కోడి మార్గం లో 3.5 కి.మీ.ల దూరంలో వుంటుంది. ధనుష్కోడి లో స్నానం చేయటానికి వెళ్ళేవారు జడ తీర్థం లో తప్పక ఆగుతారు. ఈ తీర్థం కూడా రాముడి కధలతో ముడి పది వుంది. రాముడు అయోధ్య కు తిరిగి వెళ్ళే ముందు ఇక్కడ కొంత సేపు నివసించాడని అక్కడ ఒక శివ లింగం తయారు చేసి అర్చిన్చాడని చెపుతారు. ఈ లింగాన్ని శ్రీ రామ లింగం అంటారు. శ్రీరాముడు తన జడ వెంట్రుకలను ఇక్కడి నీటి లో శుభ్రం చేసి ఒక బ్రాహ్మణుడిని చంపినా పాపాన్ని పోగొట్టుకున్నాడని చెపుతారు. పూర్తిగా తన తల వెంట్రుకలను కడుగు కొన్నతర్వాత శివ లింగాన్ని పూజించాడని కధనంగా వుంటుంది.
ఈ టెంపుల్ ఇతర టెంపుల్స్ తో పోలిస్తే చాలా చిన్నది. నిజానికి ఈ టెంపుల్ మరొక తీర్థం అయిన కావేరి తీర్థం ఆవరణలో నిర్మించారు. రావణుడి చే రెక్కలు కత్తిరించబడిన జటాయువు తన ప్రాణాలు ఇక్కడే వదిలాడని కూడా ఒక కధనం కలదు.



Click it and Unblock the Notifications