హుండ్రు జలపాతాలు రాంచి కి 45 కి. మీ. ల దూరంలో కలవు. అందమైన ఈ జలపాతాలు పురూలియ హై వే లో కలవు. స్వర్ణ రేఖా నది సుమారు 320 అడుగుల ఎత్తు నుండి పడుతూ ఈ జలపాతాలు సృష్టించింది. కింద పడే జలపాతాల నురగ నీటిలో పర్యాటకులు ఆనందంగా స్నానాలు చేయవచ్చు. ఇక్కడ సాహసికులు ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. వర్శాకాలాలు కొంచెం భయానకం అయినప్పటికీ వేసవి లో ఇది ఒక అందమైన పిక్నిక్ స్పాట్ గా వుంటుంది.



Click it and Unblock the Notifications