పహారీ మందిర్ అనేది శివుడి ఆలయం. ఇది రాంచి కొండపై సముద్రమట్టానికి 2140 అడుగుల ఎత్తున కలదు. స్వాతంత్ర పోరాట సమయంలో స్వాతంత్ర యోధులను ఇక్కడ ఉరి తీసిన కారణంగా దీనిని ఫాన్సీ తోన్గ్రి అని కూడా అంటారు. వారి జ్ఞాపకార్ధం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే నాడు జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. టెంపుల్ చేరాలంటే, 300 మెట్లు ఎక్కాలి. టెంపుల్ మహిమాన్వితం అయినదని భక్తుల కోరికలు తీరుస్తుందని చెపుతారు. ఈ టెంపుల్ ప్రదేశం నుండి రాంచి నగరం పూర్తిగా దూర దృశ్యం లో చూడవచ్చు. దీని పరిసరాలలో ఎన్నో రకాల వృక్షాలు కలవు. ఈ టెంపుల్ లో శ్రావణ మాశం పూజలు వైభవోపేతంగా జరుగుతాయి.



Click it and Unblock the Notifications