రాంచి కి 40 కి. మీ. ల దూరంలో టాటా రోడ్ లోని బుండు వద్ద అందమైన సన్ టెంపుల్ దాని 18 రధ చక్రాలతో ఏడు గుర్రాలతో నిలిచి వుంటుంది. టెంపుల్ చుట్టూ పక్క ప్రదేశాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. ఇక్కడే ఒక కొలను కూడా కలదు. చోటా నాగపూర్ ప్రజలకు ఇది ఒక మంచి పిక్నిక్ ప్రదేశం.
ఇక్కడ ఒక అందమైన ధర్మశాల కలదు. ఇక్కడి కొలను లో స్నానం చేస్తే, పాపాలు పోతాయని చెపుతారు. సూర్య దేవుడికి ఇక్కడ చాత్ పూజ చేస్తారు. ఈ టెంపుల్ పర్యాటకులకు మరియు స్థానికులకు కూడా అందుబాటులో వుంటుంది.



Click it and Unblock the Notifications